Babu mohan:టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా తన కామెడీ టైమింగ్ తో బాగా ఆకట్టుకున్న నటుడు బాబు మోహన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. కొన్ని చిత్రాలు ఈయన కామెడీ వల్లే సక్సెస్ అయ్యాయని కూడా చెప్పవచ్చు. కొన్ని చిత్రాలలో హీరోగా కూడా నటించి మంచి పేరు సంపాదించిన నటుడు బాబు మోహన్ అటు రాజకీయాలలో కూడా బాగానే రాణించారు. ఈ మధ్యకాలంలో పెద్దగా సినిమాలలో కనిపించకపోయినప్పటికీ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో కనిపిస్తూ పలు విషయాలను తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇటీవలే నాని నటించిన విడుదలైన ప్యారడైజ్ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
మేకప్ టెస్ట్ అయ్యాక పిలుస్తామని పిలవలేదు..
బాబు మోహన్(Babu mohan) మాట్లాడుతూ.. ప్యారడైజ్ సినిమా కోసం తనను సంప్రదించి మేకప్ టెస్ట్, కాస్ట్యూమ్స్ ట్రయల్ అన్ని నిర్వహించారని , షూటింగ్ మొదలయ్యాక పిలుస్తామని చెప్పారని,అయితే తన పాత్రను ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా సినిమాలో నుంచి తొలగించారంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. తాను సినిమా షూటింగ్ కోసం పిలుస్తారని ఎదురు చూస్తూ ఉంటే సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని థియేటర్లలో వచ్చిందనే విషయాన్ని బయటపెట్టారు. తనని పక్కన పెట్టడం వల్లే ఆ సినిమా భారీ డిజాస్టర్ గా మారింది అంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. తన ఉనికి సినిమాకు లక్కీ లెగ్గు అని గతంలో ప్రేమఖైదీ వంటి చిత్రాలు కూడా తన కారణంగానే మంచి విజయాలు అందుకున్నాయని, తన డైలాగ్ లు, పాటలు వింటే కచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లు సినిమాని కొనడానికి మక్కువ చూపుతారని బాబు మోహన్ తెలిపారు.
also read:Poonam Kaur:పవన్ కళ్యాణ్ విడాకుల వేళ.. పూనమ్ కౌర్ పోస్ట్ వైరల్..!
30% సేవా కార్యక్రమాలకే..
ఈయన నటించిన చిత్రాలలో అంత బువ్వు ఉంటే ఎయ్యమ్మో .. ఇంత కూరు ఉంటేన ఎయ్యమ్మో వంటి పాటలు కేవలం రెండు రోజుల రాత్రులలోనే పూర్తి చేసి సినిమాకు వంద రోజులు ఆడడానికి సహాయపడిందని తెలియజేశారు. మొత్తానికి బాబు మోహన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. బాబు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం ఆర్థికంగా వెనుకబడిన ఉన్నవారికి చేయూత అందిస్తున్నారు. అలాగే తన సంపాదనలో 20 నుంచి 30 భాగం సేవా కార్యక్రమాలకే కేటాయించారు.
also read:Aishwarya Lekshmi:జిమ్‌లో చెమటలు చిందిస్తున్న మలయాళ బ్యూటీ.. ఫొటోలు వైరల్!
చిన్నప్పటి నుంచే అలవాటు..
చిన్నతనం నుంచి స్కూళ్లలో నాటకాలు వేసినప్పుడు పేదలకు అన్నం పొట్లాలు కూడా పంచేవారని, ఆ అలవాటు నుంచి సేవా కార్యక్రమాలు మొదలయ్యాయని తెలియజేశారు. ఇటీవలే రాజకీయ పదవిలో ఉన్నప్పుడు ట్రస్టులు బ్లాక్ మనీ నుంచి వైట్ మనీ చేసుకోవడానికి మోసాలకు పాల్పడతారని చెడ్డ పేరు వస్తుందని ట్రస్ట్ ఏర్పాటు చేయలేదని ఇప్పుడు పదవిలో లేకపోవడంతో తన ఆశయాన్ని అలాగే కొనసాగిస్తున్నానంటూ తెలియజేశారు. పదవ తరగతి చదువుతున్న సమయంలోనే తాను ఈ బాధ్యతలను మోసానని.. తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను తెలియజేస్తూ తాను ఒక సినిమా షూటింగ్లో బాంబు సీన్ కోసం కారు నుంచి దూకాల్సి రావడంతో దూకేశాను. ఆ సమయంలోనే తొడ కండరం చిరిగిపోయింది. దానివల్ల ఏడాది పాటు నరకం చూసానని సరిగ్గా నడవలేకపోయాను అంటూ తెలిపారు.




