Jailer 2:కొంతమంది స్టార్ నటీమణులు కొన్ని కొన్ని పాత్రలు చేయడానికి ఇష్టపడరు. ఒకప్పుడు మేము అలాంటి పాత్రలు చేస్తే.. ఇప్పుడు కూడా అలాంటి పాత్రలే చేస్తాం.. ఇంకొక పాత్రలు చేయడం అంటూ భీష్మించుకుని కూర్చుంటారు. కానీ ఒక నటికి అలాంటి లక్షణాలు అస్సలు ఉండకూడదు. తన నటనను ప్రూవ్ చేసుకోవాలి అంటే ఎలాంటి రోల్ అయినా సరే ప్లే చేయగలగాలి. అలాంటి నటీనటులు చాలా రేర్‌గా కనిపిస్తుంటారు. వాళ్లలో టాప్‌లెస్‌లో కనిపించే అందాల ముద్దుగుమ్మ, ఎవర్గ్రీన్ బ్యూటీ విద్యాబాలన్ ఒకరు.
డిఫరెంట్ క్యారెక్టర్లకు కేరాఫ్ విద్యాబాలన్ :
విద్యాబాలన్ తన కెరీర్లో ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ కథలను చూసి చేసుకుని ముందుకు వెళ్లింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కూడా తన కెరీర్లో మరొక స్పెషల్ డిఫరెంట్ క్యారెక్టర్‌ను ఎంచుకుంది. సూపర్‌స్టార్ రజనీకాంత్, అదేవిధంగా టాలెంటెడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్టు ‘జైలర్ 2’(Jailer 2). ఈ సినిమా కోసం రజనీకాంత్ ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
‘జైలర్ 2’ నుంచి అదిరిపోయే అప్డేట్ :
రీసెంట్గా ‘జైలర్ 2’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. భారీ తారాగణం కూడా ఉంది. తాజాగా విడుదలైన ఒక క్యారెక్టర్ గ్లింప్స్ మాత్రం సోషల్ మీడియాను మడతపెట్టేస్తుంది. ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ‘జైలర్ 2’ గురించే మాట్లాడుకునేలా చేసింది.
also read:Aishwarya Rajesh:యూట్యూబర్ కి ముద్దు పెట్టిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్..!
కాంతగా విద్యాబాలన్ పవర్ఫుల్ పాత్ర :
ఇంతకీ అంతలా స్పెషల్ క్యారెక్టర్లో ఎవరు నటిస్తున్నారా అంటే మాత్రం దానికి ఆన్సర్ విద్యాబాలన్ అని చెప్పక తప్పదు. ఈ చిత్రంలో ప్రముఖ నటి, మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ విద్యాబాలన్ అత్యంత శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఆ పాత్ర పేరు ‘కాంత’. ఆమె ఇంట్రడక్షన్ రిలీజ్ చేస్తూ ఒక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
మూవీ టీమ్ విడుదల చేసిన ఆమె ఫస్ట్ లుక్ టీజర్లో విద్యాబాలన్ స్క్రీన్ ప్రజెన్స్ సూపర్ స్టైలిష్‌గా ఉంది. అసలు ఈ క్యారెక్టర్ ఈమె కోసమే రాశారేమో డైరెక్టర్. ఎంతో హుందాగా నటించిన నటి.. నీలిరంగు చీరలో, నలుపు రంగు జాకెట్లో మెట్ల పైనుంచి నడుచుకుంటూ వచ్చిన ఆమె తీరు, గంభీరమైన లుక్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
also read:TV:సోమవారం టీవీలో సినిమాల జాతర.. !
చివర్లో విద్యాబాలన్ డైలాగ్ హైలైట్ :
ఇక ఫైనల్ ట్విస్ట్ చివర్లోనే ఉంది. ఆమె చివర్లో చెప్పిన డైలాగ్ అయితే అద్భుతంగా ఉంది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌ను ఇంకొక స్థాయికి తీసుకెళ్లింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
రజనీకి దీటుగా విద్యాబాలన్ పాత్ర :
ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర ఎంత హైలెట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారో.. అభిమానులు అదేవిధంగా విద్యాబాలన్ క్యారెక్టర్ కూడా హైలెట్ అవుతుంది అంటూ డబుల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం గ్లామర్ పాత్ర కాకుండా కథను మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఇది అంటూ చిన్న టీజర్‌తోనే అర్థం అయిపోయింది.రజనీకాంత్ యాక్షన్‌కు దీటుగా విద్యాబాలన్ నటన ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
భారీ తారాగణంతో ‘జైలర్ 2’ :
ఇక ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రమ్యకృష్ణ, యోగిబాబు మొదటి విభాగంలోని తమ పాత్రలనే కొనసాగిస్తున్నట్లు సమాచారం అందుతుంది. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కాబోతుంది. రీసెంట్గా రిలీజ్ అయిన విద్యాబాలన్ గ్లింప్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.




