Jailer 2:సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా, నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జైలర్ 2’ సినిమా గురించి సినీ ప్రేక్షకుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికాల వివరాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా రజనీకాంత్‌తో పాటు ఇతర ప్రముఖ నటులు ఈ సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకున్నారనే అంశంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.
రజనీకాంత్ పారితోషికం ఎంతంటే? :
జైలర్ 2’ (Jailer 2)సినిమాలో సూపర్‌స్టార్ రజనీకాంత్ పారితోషికం ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ఆయనకు బేస్ రెమ్యునరేషన్‌గా సుమారు రూ.110 కోట్లు చెల్లించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఆయన సంపాదన ఇంతటితో ముగియదని తెలుస్తోంది. సినిమాకు వచ్చిన లాభాల్లో కూడా రజనీకాంత్‌కు వాటా ఉండేలా ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించే వసూళ్లు, నిర్మాతలకు వచ్చే లాభాలు ఆయన తుది పారితోషికంపై ప్రభావం చూపనున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా కలిపి రజనీకాంత్ మొత్తం ఆదాయం దాదాపు రూ.180 కోట్ల వరకు చేరవచ్చని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
also read:Rajinikanth:రజనీకాంత్ ఆస్తులన్నీ ట్రస్ట్‌కేనా? అసలు ట్విస్ట్ ఇదే!
ఇతర స్టార్ హీరోలకు భారీ పారితోషికాలు:
మలయాళ స్టార్ మోహన్‌లాల్‌కు ఈ సినిమా కోసం సుమారు రూ.30 కోట్లు చెల్లించినట్లు తెలుస్తుంది. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ అతిథి పాత్రలో కనిపించినందుకు రూ.25 కోట్లు అందుకున్నారనే ప్రచారం కూడా నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అలాగే విజయ్ సేతుపతికి రూ.10 కోట్లు, కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్‌కు రూ.8 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు సమాచారం.
ఇక విద్యాబాలన్‌కు రూ.6 కోట్లు, ఎస్.జె. సూర్యకు రూ.3 కోట్లు అందినట్లు టాక్ వినిపిస్తోంది. రమ్యకృష్ణకు సుమారు రూ.2.5 కోట్లు, సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తికి రూ.2 కోట్లు చెల్లించినట్లు టాక్ వినిపిస్తుంది.
also read:Rakul Preet Singh: చీరకట్టులో నడుము అందాలతో సెగలు పుట్టిస్తున్న రకుల్!
దర్శకుడు, సంగీత దర్శకుడి రెమ్యునరేషన్ :
‘జైలర్’ మొదటి భాగం విజయంతో గుర్తింపు పొందిన దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సీక్వెల్ కోసం సుమారు రూ.35 కోట్లు అందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాకు సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన అనిరుధ్ రవిచందర్‌కు రూ.20 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో హాట్ టాపిక్ :
సూపర్‌స్టార్ రజనీకాంత్ నుంచి ఇతర ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణుల వరకు ‘జైలర్ 2’ సినిమా కోసం తీసుకున్నట్లు ప్రచారంలో ఉన్న పారితోషికాల వివరాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఎవరికి ఎంత మొత్తం చెల్లించారనే అంశంపై అభిమానుల్లో చర్చ సాగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారాయి.




