Monday, November 9, 2026
HomeINTERVIEWSJanhvi Kapoor:సర్జరీతో మారిన అమ్మ అభిప్రాయం.. జాన్వీ ఆసక్తికర విషయాలు!

Janhvi Kapoor:సర్జరీతో మారిన అమ్మ అభిప్రాయం.. జాన్వీ ఆసక్తికర విషయాలు!

Janhvi Kapoor:జాన్వీ చేసిన వ్యాఖ్యల్లో నోస్ సర్జరీ ప్రస్తావన ప్రత్యేకంగా నిలిచింది. తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత శ్రీదేవి తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారని జాన్వీ గుర్తుచేసుకున్నారు.

on
- Advertisement -banner Ad

Janhvi Kapoor:బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న జాన్వీ కపూర్ తాజాగా తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ ప్రయాణం మొదలైన రోజుల్లో ఎదురైన అనుభవాలను గుర్తుచేసుకుంటూ కొన్ని విషయాలను బయటపెట్టారు. ముఖ్యంగా తాను హీరోయిన్‌గా రాణించగలనన్న నమ్మకం శ్రీదేవికి మొదట్లో లేదని వెల్లడించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా తన నోస్ సర్జరీ తర్వాతే తల్లి ఆలోచనలో మార్పు వచ్చిందని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సినిమా రంగంలోకి రావడంపై శ్రీదేవికి సందేహాలు:

జాన్వీ కపూర్ తన కజిన్, నటి మహేశ్వరితో జరిగిన ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. తనకు చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి ఉండేదని, నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కనేదాన్నని తెలిపారు. అయితే తాను సినిమాల్లో విజయవంతం కాగలనన్న నమ్మకం తన తల్లికి మొదట్లో లేదని వెల్లడించారు. సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదని, అందుకు ఎంతో కష్టపడాల్సి ఉంటుందని శ్రీదేవి భావించేవారని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

also read:Rajamouli:వారణాసి సినిమా కోసం రాజమౌళి మాస్టర్ ప్లాన్..!

నోస్ సర్జరీ తర్వాత మారిన అమ్మ అభిప్రాయం:

ఈ ఇంటర్వ్యూలో జాన్వీ(Janhvi Kapoor) చేసిన వ్యాఖ్యల్లో నోస్ సర్జరీ ప్రస్తావన ప్రత్యేకంగా నిలిచింది. తాను ముక్కుకు సర్జరీ చేయించుకున్న తర్వాత శ్రీదేవి తనపై ఉన్న అభిప్రాయాన్ని మార్చుకున్నారని జాన్వీ గుర్తుచేసుకున్నారు. అప్పటివరకు నటిగా తన భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తం చేసిన తల్లి.. ఆ తర్వాత తనను ప్రోత్సహించడం మొదలుపెట్టారని చెప్పారు. తన నిర్ణయంపై పట్టుదలగా ఉండటం చూసి శ్రీదేవిలో కూడా మార్పు వచ్చిందని వివరించారు. అప్పుడే అమ్మ మనసు మార్చుకుందని చెప్పుకొచ్చారు. ఆమె మాట్లాడిన మాటలుబ్సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Priyanka Chopra:నిర్మాతగా ప్రియాంక చోప్రా ఏ సినిమా తెరకెక్కిస్తోందో తెలుసా..?

ప్రాణం పెట్టి పనిచేయాలని సూచించిన శ్రీదేవి:

నటిగా ఎదగాలంటే అందం, గుర్తింపు మాత్రమే సరిపోవని.. కష్టపడే తత్వం కూడా ఉండాలని శ్రీదేవి తనకు సూచించినట్లు జాన్వీ తెలిపారు. సినిమా రంగంలో మంచి స్థాయికి చేరుకోవాలంటే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, చేసే పనిపై పూర్తి అంకితభావం చూపించాలని చెప్పేవారట. తన కెరీర్ విషయంలో తల్లి ఇచ్చిన ఈ సూచనలు ఎంతో విలువైనవని జాన్వీ గుర్తుచేసుకున్నారు.

- Advertisement -
Advertisement

శ్రీదేవి కూడా నోస్ సర్జరీ చేయించుకున్నారా?

ఇదే ఇంటర్వ్యూలో మరో ఆసక్తికర విషయాన్ని కూడా జాన్వీ ప్రస్తావించారు. తన తల్లి శ్రీదేవి కూడా నోస్ సర్జరీ చేయించుకున్నారని వెల్లడించారు. దీంతో శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పాత విషయాలు మరోసారి చర్చకు వచ్చాయి. మొత్తానికి జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తల్లి ప్రోత్సాహం, తన కెరీర్ కోసం తీసుకున్న నిర్ణయాలు, ఎదుర్కొన్న అనుభవాలను జాన్వీ ఇలా పంచుకోవడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you