tollywood:టాలీవుడ్లో హీరోలు, హీరోయిన్లకు ఎంతటి క్రేజ్ ఉంటుందో స్టార్ కమెడియన్లకు కూడా అంతే స్థాయిలో డిమాండ్ ఉంటుంది. ఒకప్పుడు సినిమాల్లో కామెడీకి ప్రత్యేక ట్రాక్ ఉండేది. కానీ ఇప్పుడు కథలోనే కామెడీని అంతర్భాగంగా మారుస్తున్నారు దర్శకులు. ముఖ్యంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే నటులు ఉంటే సినిమాకు మరింత ఆకర్షణ పెరుగుతుంది. అందుకే స్టార్ కమెడియన్ల కాల్షీట్ల కోసం నిర్మాతలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కొందరు కమెడియన్లు రోజుకు లక్షల రూపాయల పారితోషికం అందుకుంటున్నారనే ప్రచారం సినీ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
టాలీవుడ్లో టాప్ కమెడియన్ల రెమ్యునరేషన్ ఎంతంటే:
ప్రస్తుతం టాలీవుడ్లో (tollywood)బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, సునీల్, సత్య, అలీ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వంటి నటులకు మంచి డిమాండ్ ఉంది. వీరు తమ కామెడీ టైమింగ్, విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
కామెడీ కింగ్ బ్రహ్మానందం ప్రత్యేకతే వేరు:
టాలీవుడ్లో కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు బ్రహ్మానందం. దశాబ్దాల పాటు వందలాది సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించారు. ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లలో నవ్వులు పూస్తాయనే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, తనకు సరిపోయే ప్రత్యేకమైన పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన పారితోషికం విషయంలో కూడా భారీ స్థాయిలోనే డిమాండ్ ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. ప్రస్తుతం సినిమాలు తగ్గిస్తున్నప్పటికీ, ప్రత్యేక పాత్రలకు ₹10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్
also read:surekha vani: మానసిక వేదనకు గురవుతున్న.. సురేఖ వాణి వీడియో వైరల్..!
వెన్నెల కిషోర్‌కు పెరిగిన డిమాండ్ :
ప్రస్తుత తరం టాలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న కమెడియన్లలో వెన్నెల కిషోర్ ఒకరు. తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నారు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న బడ్జెట్ చిత్రాల వరకు వరుస అవకాశాలు అందుకుంటున్నారు. రోజుకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్నారనే అంచనాలు వినిపిస్తున్నాయి.
also read:Vivek Oberoi:గొప్ప మనసు చాటుకున్న వివేక్ ఒబెరాయ్..!
సత్య, సునీల్‌కు కూడా భారీ క్రేజ్ :
ఇక ప్రస్తుత జనరేషన్లో సత్య కామెడీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. తన విభిన్నమైన హావభావాలు, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్విస్తున్నారు. సత్య కామెడీ టైమింగ్‌కు భీభత్సమైన క్రేజ్ ఉండటంతో రోజుకు ₹5 లక్షల మార్కును అందుకుంటున్నారు. మరోవైపు సునీల్ కమెడియన్‌గా మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా తన సత్తా చాటుతున్నారు. అలీ కూడా ఎన్నో ఏళ్లుగా తన కామెడీతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వీళ్లు కూడా రోజుకి 2 లక్షల నుండి 8 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారట.
హీరోలతో సమానంగా కమెడియన్ల డిమాండ్:
ఒకప్పుడు సినిమాల్లో కమెడియన్లకు పరిమితమైన పాత్రలే ఉండేవి. కానీ ఇప్పుడు కథను ముందుకు నడిపించడంలోనూ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలోనూ వీరి పాత్ర కీలకంగా మారింది. అందుకే స్టార్ కమెడియన్ల పారితోషికాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. మొత్తానికి టాలీవుడ్లో హీరోలతో పాటు కమెడియన్లకు కూడా మంచి మార్కెట్ ఉందని ఈ అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.




