Monday, November 9, 2026
HomeLATESTOTT:ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే.. లిస్ట్ ఇదిగో!

OTT:ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలివే.. లిస్ట్ ఇదిగో!

OTT:ఈ వారం థియేటర్లలోకి అరడజనుకు పైగా తెలుగు సినిమాలు రాబోతున్నాయి.నవంబర్ 9 నుంచి 15 వరకు థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు

on
- Advertisement -banner Ad

OTT:సినీ ప్రేక్షకులకు ఈ వారం వినోదం పుష్కలంగా ఉండనుంది. గత వారం రామాయణ, సీన్ వంటి భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ వారం చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు రానున్నాయి. నవంబర్ 9 నుంచి 15 వరకు థియేటర్లు, ఓటీటీల్లో(OTT) విడుదలయ్యే చిత్రాలపై ఓ లుక్కేద్దాం.

థియేటర్లలో చిన్న సినిమాల సందడి :

ఈ వారం థియేటర్లలోకి అరడజనుకు పైగా తెలుగు సినిమాలు రాబోతున్నాయి. ఇట్లు అర్జున, G.O.A.T, భోగి, మాయ లేడీ, డార్క్ చాక్లెట్, దొంగ నా కొడుకు, చంద్రయాన్, జింగో పెన్ వంటి చిత్రాలు విడుదలకు సిద్ధమయ్యాయి. వీటిలో ఇట్లు అర్జున, భోగి సినిమాలపై ప్రేక్షకుల్లో కొంత ఆసక్తి కనిపిస్తోంది. చిన్న సినిమాలుగా వస్తున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో చూడాలి.

- Advertisement -
Advertisement

also read:Tollywood:రెండుసార్లు విడాకులు తీసుకున్న వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న బుల్లి తెర నటి..!

నెట్‌ఫ్లిక్స్‌లో ఆసక్తికరమైన చిత్రాలు :

ఓటీటీ విషయానికి వస్తే నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారం పలు భాషలకు చెందిన సినిమాలు, సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 9న ఫ్రెంచ్ చిత్రం “ది గుడ్ లాయర్ స్ట్రీమింగ్” కానుంది. నవంబర్ 11న “ది బాడీ”, నవంబర్ 12న “నెవర్ సరెండర్”, “మిరాకిల్స్ ఆఫ్ ఈఆర్”, “అలెన్ వంటి చిత్రాలు”, సిరీస్‌లు రానున్నాయి.

- Advertisement -
Advertisement

ఇక నవంబర్ 13న తెలుగు సినిమా “రణబాలి”, హిందీ చిత్రం “దాయిరా”, కెనడియన్ సిరీస్ “హార్ట్‌ల్యాండ్” ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 15న “కాంక్ ఆన్” సినిమా అనే ఇంగ్లీష్ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ కానుంది.

also read:Tammareddy:ఉదయ్ కిరణ్‌కు అవకాశాలు రాకుండా అడ్డుకున్నారా? తమ్మారెడ్డి ఏమన్నారంటే!

- Advertisement -
Advertisement

ప్రైమ్ వీడియోలో జైలర్ 2, రింగ్స్ ఆఫ్ పవర్ :

అమెజాన్ ప్రైమ్ వీడియోలోనూ ఈ వారం ప్రత్యేకమైన కంటెంట్ రాబోతోంది. నవంబర్ 11న “ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్” మూడో సీజన్ స్ట్రీమింగ్‌కు రానుంది. అలాగే నవంబర్ 12న “జైలర్ 2” విడుదల కానున్నట్లు అందిన జాబితాలో పేర్కొన్నారు. నవంబర్ 13న గరివిడి లక్ష్మి కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ కొత్త విడుదలలు:

జియోహాట్‌స్టార్‌లో నవంబర్ 12న “పుష్పక విమానం”, నవంబర్ 13న “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్” స్ట్రీమింగ్‌కు రానున్నాయి. జీ5లో నవంబర్ 11న బ్లైండ్ గేమ్, నవంబర్ 13న బంద్రా, అఫ్రాతఫ్రీ, మిర్గయ 1.5 వంటి చిత్రాలు విడుదల కానున్నాయి.

యాపిల్ టీవీ ప్లస్‌లో నవంబర్ 13న 12 12 12, బీయింగ్ హెయిమన్ రానున్నాయి. సోనీ లివ్‌లో పరివారిక్ మనోరంజన్, మనోరమ మ్యాక్స్‌లో ది థర్డ్ మర్డర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్‌లో రింగ్స్ ఆఫ్ పవర్ అందుబాటులోకి రానున్నాయి.

మొత్తంగా ఈ వారం థియేటర్లలో చిన్న సినిమాలు, ఓటీటీల్లో వివిధ భాషలకు చెందిన కొత్త కంటెంట్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you