Sunday, November 8, 2026
HomeLATESTsurekha vani: మానసిక వేదనకు గురవుతున్న.. సురేఖ వాణి వీడియో వైరల్..!

surekha vani: మానసిక వేదనకు గురవుతున్న.. సురేఖ వాణి వీడియో వైరల్..!

surekha vani: ప్రముఖ నటి సురేఖా వాణి తన ప్రైవేటు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఆమె మండిపడుతోంది. కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించింది.

on
- Advertisement -banner Ad

surekha vani: సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాలలో నటించి, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖ వాణి వీడియో అంటూ సోషల్ మీడియాలో ఈరోజు ఉదయం నుంచి తెగ వైరల్ గా మారింది.. ఈ వీడియో చూసిన చాలామంది ఆశ్చర్యపోయారు. ఈ వయసులో సురేఖ వాణి ఇలాంటి పనులు చేస్తుందా అంటూ మరి కొంత మంది కామెంట్ చేస్తూ ఉన్న తరుణంలో సోషల్ మీడియా వేదికగా తన అకౌంట్ హ్యాక్ అయిందని , తన ప్రమేయం లేకుండా తన వ్యక్తిగత కంటెంట్ ని బయటకు వదిలారంటూ ఒక్క పోస్టుని విడుదల చేసింది

డీప్ ఫేక్ వీడియో సంచలనం..

చాలామంది ఇది డీప్ ఫేక్ లేదా మార్ఫింగ్ టెక్నాలజీ ద్వారా ఈ వీడియోలను సృష్టించారనే విధంగా వార్తలు వినిపించాయి. సురేఖ వాణి ప్రతిష్టకు భంగం కలిగించారని ప్రచారం సాగుతున్న తరుణంలో ఆమె ఒక పోస్ట్ విడుదల చేసింది.తన ఇంస్టాగ్రామ్ ని సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని తన ప్రమేయం లేకుండానే ఇలా వ్యక్తిగత కంటెంట్ ను బయటికి విడుదల చేశారు. కేవలం వ్యూస్ పబ్లిసిటీ కోసమే తన ప్రైవసీని రోడ్డుపైకి లాగొద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పేజీలు, యూట్యూబ్ ఛానల్ లకు కంటెంట్ సర్క్యూలేట్ చేయకూడదు అంటూ తాజాగా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక వీడియోని షేర్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది సురేఖ వాణి..

- Advertisement -
Advertisement

also read: Pooja Hegde:నా రూపం నాకే నచ్చేది కాదు.. ముక్కు, నవ్వుపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!

స్పందించిన సురేఖ వాణి..

సురేఖ వాణి మాట్లాడుతూ ఎమోషనల్ గా భాగోద్వేగానికి లోనయ్యారు.. నిన్న రాత్రి నుంచి నా ప్రైవేట్ వీడియోల పైన సోషల్ మీడియాలో ఎలాంటి అసహ్య ప్రచారం చేస్తున్నారో ఎలా రాసుకుంటున్నారో చూసి తాను మానసిక వేదనకు గురవుతున్నానని, తన అనుమతి లేకుండా చేస్తున్న ఈ వీడియోలను, పోస్టులను తొలగించాల్సిందిగా తెలియజేసింది. ఇప్పటికే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేశానని, ఎవరైతే ఈ వీడియోలను షేర్ చేశారో.. మీ అంతట మీరే స్వచ్ఛందంగా ఆ వీడియోలను డిలీట్ చేస్తే మంచిది అంటూ తెలియజేసింది.

- Advertisement -
Advertisement

also read: Vivek Oberoi:గొప్ప మనసు చాటుకున్న వివేక్ ఒబెరాయ్..!

కఠిన చర్యలు తీసుకుంటాము..

ఇక పైన ఎవరైనా నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత కంటెంట్ ని పోస్ట్ చేసినా లేదా సర్కులేట్ చేసినా కూడా ఉపేక్షించేది ఉండదని, వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటానని లీగల్ గా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి తాను ఏమాత్రం వెనకడుగు వేయనంటూ సురేఖవాణి తెలియజేసింది. నా సమస్యను అర్థం చేసుకొని తక్షణమే స్పందించినటువంటి తెలంగాణ పోలీస్ శాఖకు ప్రత్యేకించి ధన్యవాదాలు అంటూ తెలియజేసింది. పోలీస్ ఫిర్యాదులో నమోదు కావడం చేత పలు రకాల యూట్యూబ్ ఛానల్స్ , మీమ్స్ పేజీల నిర్వాహకులు కూడా ఆ వీడియోలను తొలగించే పనిలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో సురేఖవాణి పెద్దగా సినిమాలలో ఎక్కడ కనిపించలేదు. తన కుమార్తె సుప్రితతో కలసి ట్రెండింగ్ వీడియోస్ చేస్తే ఫోటోషూట్లతో నిరంతరం వైరల్ గా మారుతూనే ఉంటుంది. కూతురు సుప్రీత ని కూడా హీరోయిన్గా చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మొత్తానికి సురేఖ వాణి షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

 

 

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you