Monday, September 14, 2026
HomeLATESTChiranjeevi:నాలుగు రోజుల గ్యాప్‌లో చిరంజీవి రెండు సినిమాలా? ఇదే అసలు ట్విస్ట్!

Chiranjeevi:నాలుగు రోజుల గ్యాప్‌లో చిరంజీవి రెండు సినిమాలా? ఇదే అసలు ట్విస్ట్!

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా, విశ్వంభర సినిమాల విడుదల తేదీలపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

on
- Advertisement -banner Ad

Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు రాబోయే రోజుల్లో వరుసగా భారీ సినిమాలతో పండుగ వాతావరణం నెలకొననుంది. చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’, ‘కాకా’ చిత్రాలపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల విడుదల తేదీల విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రెండు చిత్రాలు దగ్గర దగ్గర తేదీల్లో విడుదలయ్యే అవకాశం ఉండటంతో ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

సంక్రాంతి బరిలో ‘కాకా’ :

దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. చిరంజీవి(Chiranjeevi), బాబీ కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి సీజన్‌లో ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. దీంతో అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘కాకా’ను కూడా సంక్రాంతి సమయంలోనే విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:TV:వినాయక చవితి స్పెషల్.. టీవీలో ఈరోజు అదిరిపోయే సినిమాలు..!

‘విశ్వంభర’కు కొత్త డేట్? :

మరోవైపు వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ సోషియో-ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతోంది. భారీ స్థాయిలో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ ఉండటంతో సినిమా నిర్మాణం, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగా గతంలో అనుకున్న విడుదల ప్రణాళికల్లో మార్పులు రావచ్చనే ప్రచారం సాగుతోంది.

- Advertisement -
Advertisement

ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘విశ్వంభర’ను 2027 జనవరి 9న సంక్రాంతి బరిలోకి తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే జనవరి 9న ‘విశ్వంభర’, జనవరి 13న ‘కాకా’ విడుదలైతే కేవలం నాలుగు రోజుల వ్యవధిలో చిరంజీవి నటించిన రెండు భారీ చిత్రాలు థియేటర్లలోకి వచ్చినట్లవుతుంది. ఇది బాక్సాఫీస్ పరంగా రెండు సినిమాలకూ అనుకూలంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ALSO READ:Priyanka Arul Mohan: చీర కట్టులో మెస్మరైజ్ చేస్తున్న ప్రియాంక.. ఫోటోలు వైరల్!

- Advertisement -
Advertisement

సమ్మర్‌కు ‘విశ్వంభర’? :

ఈ నేపథ్యంలో ‘కాకా’ను ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం జనవరి 13న విడుదల చేసి, ‘విశ్వంభర’ను 2027 సమ్మర్‌కు వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఫిలింనగర్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. భారీ వీఎఫ్ఎక్స్‌తో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’కు సోలో రిలీజ్ లభిస్తే సినిమాకు మరింత ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం కూడా ఉంది.

అయితే ఇవన్నీ ప్రస్తుతం వినిపిస్తున్న ఇండస్ట్రీ వర్గాల సమాచారమే. చిరంజీవి సినిమాల విడుదల తేదీలపై తుది నిర్ణయం ఏమిటి? ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారు? అనే విషయాలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you