Wednesday, July 22, 2026
HomeLATESTOtt :డ్యాన్స్‌లో దాగిన దెయ్యాల రహస్యం.. ఓటీటీలోకి వచ్చిన సూపర్‌నేచురల్ హారర్ మూవీ!

Ott :డ్యాన్స్‌లో దాగిన దెయ్యాల రహస్యం.. ఓటీటీలోకి వచ్చిన సూపర్‌నేచురల్ హారర్ మూవీ!

Ott : డ్యాన్స్ నేపథ్యంలో సాగే మలయాళ సూపర్‌ నేచురల్ హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

on
- Advertisement -banner Ad

Ott :మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకులలో రోజురోజుకు ఆదరణ పెరుగుతుంది. విభిన్నమైన కథలు, సహజమైన నటన, ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో బాలీవుడ్ చిత్రాలు ఓటీటీలో దుమ్ము దులిపేస్తున్నాయి. తాజాగా థియేటర్లలో ప్రశంసలు అందుకున్న మలయాళ సూపర్ నేచురల్ హారర్ కామెడీ “కర్కకం” (Karakkam)ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం జూలై 3 నుంచి సోనీ లైవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

డాన్స్ చేసే దెయ్యాల కథ:

ధనుష్, ఖాజా అనే ఇద్దరు స్నేహితులు చుట్టూ తిరుగుతుంది ఈ కథ. న్యూ ఇయర్ వేడుకల్లో మద్యం మత్తులో వారు చర్చి స్మశాన వాటికలోకి వెళ్లి అక్కడ సమాధులపై ఉన్న ఐదు ఇత్తడి శిలువలను తొలగిస్తారు. వారి ఈ చర్యతో అక్కడ నిద్రిస్తున్న ఐదు అశాంతి ఆత్మలు మేలుకుంటాయి. అయితే ఇవి సాధారణ దయ్యాలు కాదు అని ఆ తర్వాత తెలుస్తుంది. సంగీతం వినిపిస్తే డాన్స్ చేసే విచిత్రమైన ఆత్మలు. వాటి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు స్నేహితులు ఓ లాడ్జ్ లో ఆశ్రయం తీసుకుంటారు. అక్కడ జరిగే భయానక సంఘటనలు, వినోదాత్మక సన్నివేశాలు, ఎమోషన్స్, కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి. సీన్ సీన్ కి ప్రేక్షకులు ఖచ్చితంగా సర్ప్రైజింగ్ గా ఫీల్ అవుతారు. చివరికి తమ తప్పును గ్రహించిన వారు ఆ ఆత్మలకు ఎలా విముక్తి కల్పించాలన్నది సినిమా ప్రధాన అంశం.

- Advertisement -
Advertisement

also read:Nani:నాని నెక్స్ట్ మూవీ లాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ కాంబో!?

నటీనటులు టెక్నికల్ హైలెట్స్:

ఈ చిత్రంలో శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు సుభాష్ లలిత్ సుబ్రహ్మణ్యన్ హారర్, కామెడీ, సంగీతాన్ని సమతూకంగా మేళవిస్తూ కథను తెరకెక్కించారు. ‘ఖైదీ’, ‘విక్రమ్ వేద’ చిత్రాలకు సంగీతం అందించిన శ్యాం సిఎస్ ఈ సినిమాకి కూడా ఆకట్టుకునే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. మ్యూజికల్ హర్రర్ కాన్సెప్ట్ ఈ చిత్రానికి మరింత ఆకర్షణగా నిలుస్తుంది.

- Advertisement -
Advertisement

also read:Samantha:అరుదైన మైలురాయికి చేరువలో సమంత!

వీకెండ్ కు మంచి ఛాయిస్:

భయం, కామెడీ వినూత్నమైన కథాంశాన్ని ఒకేసారి ఆస్వాదించాలి అని కోరుకునే ప్రేక్షకులకు ఈ “కరక్కం” మూవీ మంచి ఎంపిక అని చెప్పవచ్చు. హారర్ కు కొత్త టచ్ ఇవ్వడంతో పాటు కామెడీ అదే విధంగా కుటుంబంతో కలిసి సరదాగా వీక్షించే విధమైనటువంటి ఈ సినిమా ఈ వీకెండ్ లో చూసేందుకు మంచి ఎంటర్టైనర్ గా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you