Wednesday, July 22, 2026
HomeLATESTNani:నాని నెక్స్ట్ మూవీ లాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ కాంబో!?

Nani:నాని నెక్స్ట్ మూవీ లాక్.. సెన్సేషనల్ డైరెక్టర్‌తో బిగ్గెస్ట్ బ్లాస్టింగ్ కాంబో!?

Nani:నేచురల్ స్టార్ నాని తదుపరి సినిమా గురించి ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సుబాష్ కె రాజ్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేసే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీపై తాజా అప్‌డేట్ తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Nani:హీరో నాని అభిమానులకి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నాచురల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రెసెంట్ ‘ది ప్యారడైజ్’ అనే సినిమా కోసం బాగా కష్టపడి వర్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం చాలా చాలా రిస్కీ స్టంట్స్ కూడా డూప్ లేకుండా చేస్తున్నాడు అన్న విషయం బయటకు వచ్చింది. నాని(Nani) తన సినిమాలను చాలా పక్కాగా ప్లాన్ చేస్తూ సినిమా సినిమాకి డిఫరెంట్ కాన్సెప్ట్ ఉండే విధంగా చూసి చేసుకుంటారు.

కొత్తవాళ్లకు ఛాన్స్:

డైరెక్టర్స్ ను కూడా అలాగే ఎంచుకుంటూ ఉంటాడు . ఇప్పుడు నాని మరొకసారి సెన్సేషనల్ సబ్జెక్టుతో మన ముందుకు రాబోతున్నాడు అంటూ తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని ఎప్పుడు స్టార్ట్ దర్శకులతో సినిమా చేయాలి అని అనుకోరు. ఆ ఆలోచనే ఆయనకు ఉండదు. మంచి కథ దొరికితే ఏ డైరెక్టర్ తో అయినా సినిమా చేస్తారు. కొత్తవాళ్లకు కూడా ఛాన్స్ ఇస్తారు. చిన్న దర్శకులతో కూడా పనిచేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు . ఇది చాలామందికి తెలిసిన విషయమే.

- Advertisement -
Advertisement

also read:Samantha:అరుదైన మైలురాయికి చేరువలో సమంత!

క్రేజీ దర్శకుడితో సినిమా:

తాజాగా నాని మరొక క్రేజీ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు అనే వార్త టాలీవుడ్ వర్గాలలో గట్టిగా వినిపిస్తుంది. ఇటీవల యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా తెరకెక్కిన తమిళ్ చిత్రం “బ్లాస్ట్” ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయింది అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ సినిమాలో అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రలు పోషించగా సుభాష్ కే. (Subash K Raj)రాజు దర్శకత్వం వహించారు. ఈ సినిమా విజయంతో దర్శకుడు సుభాష్ కు మంచి గుర్తింపు లభించింది.

- Advertisement -
Advertisement

also read:OTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సుభాష్ కి నాని ఛాన్స్:

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుభాష్ కి నాని ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీళ్ళ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం వర్గాలలో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు పూర్తయ్యాయి అని..హీరోయిన్ సెలక్షన్ కూడా కంప్లీట్ అయిపోయింది అని.. సుభాష్ చెప్పిన కథ నానికి పిచ్చిపిచ్చిగా నచ్చేసింది అని.. అందుకే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అగ్రిమెంట్ పై కూడా సైన్ చేసేసాడు అనే టాక్ వినిపిస్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు. నాని చూస్ చేసుకునే కథలు చాలా డిఫరెంట్ గా ఉంటాయని.. ఈ సినిమాతో కూడా ఒక డిఫరెంట్ సబ్జెక్టును జనాలకి పరిచయం చేస్తాడు అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you