2014లో తొలిసారి తెలుగు , తమిళ్ ద్విభాష చిత్రం డేగా ద్వారా అవకాశమందుకున్న ఈమె.. ఆ తర్వాత టిట్టూ ఎంబీఏ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ప్రగ్యా జైస్వాల్.
ఇక 2015లో తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె.. ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో మంచి నటన కనబరిచింది.
అడపా దడపా సినిమాలు చేస్తున్న ఈమె అఖండ సినిమాతో ఊహించిన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో కలెక్టర్ పాత్రలో జీవించేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ప్రగ్య జైస్వాల్ ఇటు సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకుంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.
తాజాగా వైట్ చుడీ దార్ లో మొక్కల మధ్య నవ్వుతూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
మొత్తానికి ప్రగ్య జైస్వాల్ పంచుకున్న ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.