Ram Gopal Varma:బాలీవుడ్ , టాలీవుడ్ లో ఒకప్పుడు సెన్సేషనల్ డైరెక్టర్గా పేరు సంపాదించారు రాంగోపాల్ వర్మ. ఎలాంటి విషయాల పైన అయినా సరే తనదైన స్టైల్ లో స్పందిస్తూ ఉంటారు వర్మ. ఈ మధ్యకాలంలో తెరకెక్కించే సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ నిరంతరం ఏదో ఒక వార్తలలో వినిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా వర్మకు ఒక నటితో వివాహం అయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ నటి ఎవరో కాదు ఊర్మిళా మాతోండ్కర్. వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగిందనే వార్తలు గతంలో కూడా వైరల్ గా మారాయి. ఇప్పుడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం పైన ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు.
రాంగోపాల్ వర్మ రహస్యంగా పెళ్లి చేసుకున్నారు..
సిద్ధార్థ్ కనన్ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో జ్యోతి వెంకటేష్ మాట్లాడుతూ.. ‘ఒకసారి ఒక ప్రముఖ తెలుగు హీరో తనని కలిసినప్పుడు రాంగోపాల్ వర్మ(Ram Gopal Varma), ఊర్మిళ వివాహం చేసుకున్న సంగతి ఎందుకు రాయడం లేదంటూ అడిగారు. అది కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఆలయంలో వీరి వివాహం జరిగిందని చెబుతూ ఆ వివాహం జరిపించిన పూజారి నెంబరు కూడా ఇచ్చారు. ఈ వార్తని ప్రచురించే ముందు నేను కూడా ఊర్మిలాకి ఫోన్ చేయగా ఆమె ఏడుస్తూ అసంతృప్తిని తెలియజేసిందే తప్ప వివాహం జరగలేదనే విషయాన్ని ఖండించలేదని తెలిపారు అంటూ జర్నలిస్ట్ జ్యోతి వెంకటేష్ అన్నారు.
also read:Amani:క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఛాన్సులు కోల్పోయా.. ఆమని కామెంట్స్!
ఆర్జీవిని ప్రశ్నిస్తే నో కామెంట్..
ఆ తర్వాత ఆర్జీవిని ఈ విషయం పైన ప్రశ్నించగా దీనిపైన మాట్లాడడానికి అంగీకరించారని, వీరు విడిపోవడానికి కూడా ముఖ్య కారణం ఊర్మిళ ఆర్జీవీ తో చట్టబద్ధంగా పెళ్లి బంధం లోకి అడుగు పెట్టాలని కోరడమే వీరు విడిపోవడానికి ముఖ్య కారణమని జ్యోతి వెంకటేష్ వివరించారు. అయితే ఆ విషయానికి వర్మ సిద్దపడకపోవడంతో ఇద్దరు విడిపోయారంటూ తెలియజేశారు. గాయం, అంతం, రంగీలా, సత్య తదితర చిత్రాలను రాంగోపాల్ వర్మ తెరకెక్కించగా ఇందులో హీరోయిన్ గా ఊర్మిళ నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.
also read:Friday ott movies: ఓటీటీ మూవీ.. ఏకంగా 14 సినిమాలు!
రాంగోపాల్ వర్మతో విభేదాలపై ఊర్మిళా కామెంట్..
అలా రాంగోపాల్ వర్మ, ఊర్మిళ జంట హిట్ కాంబినేషన్ అయినప్పటికీ.. ఆ తర్వాత మళ్లీ కలిసి కనిపించకపోవడంతో బాలీవుడ్ లో పలు రకాల రూమర్స్ వినిపించాయి. కానీ గత ఏడాది సత్య రీ రిలీజ్ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్మిళ డైరెక్టర్ తో తనకి ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవంటూ క్లారిటీ ఇచ్చింది.




