Wednesday, July 22, 2026
HomeLATESTTrisha:త్రిష టంగ్ స్లిప్..రానాను "లేడీస్ మ్యాన్" అంటూ షాకింగ్ కామెంట్!

Trisha:త్రిష టంగ్ స్లిప్..రానాను “లేడీస్ మ్యాన్” అంటూ షాకింగ్ కామెంట్!

Trisha:నటి త్రిష రానా దగ్గుబాటి గురించి చేసిన 'టంగ్ స్లిప్' కామెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'లేడీస్ మ్యాన్' అంటూ చేసిన వ్యాఖ్యతో మళ్లీ ఇద్దరి మధ్య ఉన్న బంధంపై చర్చ మొదలైంది. అసలు త్రిష ఏమన్నారు? పూర్తి వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Trisha:హీరోయిన్ త్రిష, హీరో రానాకు సంబంధించిన వార్తలు గతంలో ఎన్ని వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అని, అది ఫ్రెండ్షిప్ కాదు అని, ఫ్రెండ్షిప్‌కు మించినదే అని చాలా రకాల వార్తలు వినిపించాయి. అయితే దీనిపై ఎప్పుడూ రానా కానీ, త్రిష(Trisha) కానీ స్పందించలేదు. ఇంకొంతమంది ఏకంగా వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు అని, కొన్ని కారణాల చేత విడిపోయారు అని ఓపెన్‌గానే మాట్లాడుకున్నారు. అయితే దీనిపై ఎప్పుడూ స్పందించని త్రిష తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాత్రం పరోక్షంగా క్లారిటీ ఇచ్చింది. దీంతో త్రిష మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

రానాతో బంధంపై త్రిష క్లారిటీ:

ఓ ఇంటర్వ్యూలో రానాతో తనకున్న బంధం గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్రిష మాట్లాడుతూ, “నాకు రానా (RANA)దాదాపు 18 ఏళ్ల వయసు నుంచే పరిచయం ఉంది. అప్పట్లో చెన్నైలో టీ నగర్‌లో ఉండేవాళ్లం. ఎదురుగా ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు కుటుంబం ఇల్లు ఉండేది” అని గుర్తు చేసుకుంది. రానా కూడా తనకు బాల్యం నుంచే బాగా తెలుసు అనే విషయాన్ని చెప్పుకొచ్చింది. చిన్నప్పటి నుంచే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని కూడా ఆమె చెప్పింది.

- Advertisement -
Advertisement

రూమర్స్‌పై పరోక్షంగా కౌంటర్:

అంతేకాదు, వాళ్లపై వస్తున్న రూమర్స్‌కు పరోక్షంగా కౌంటర్ ఇస్తూ త్రిష ఆసక్తికరంగా మాట్లాడింది. “మా కథకు ముగింపు ఉండదు. కొన్నిసార్లు చాలా మంచి స్నేహితులుగా ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడుకోం కూడా. కానీ మా బంధం మాత్రం ఎప్పుడూ స్ట్రాంగ్‌గానే ఉంటుంది. Love-Hate రిలేషన్‌షిప్ లాంటిది మా బంధం” అని చెప్పుకొచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా మా స్నేహం కొనసాగుతోంది అని, జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా పూర్తిగా ఒకరినొకరు దూరం చేసుకోలేమని, అలాంటి బంధం మాది అని వెల్లడించింది.

also read:OTT :ఈ వారం OTTలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.. స్ట్రీమింగ్‌కు వస్తున్న టాప్ సినిమాలు ఇవే!

- Advertisement -
Advertisement

“రానా లేడీస్ మ్యానే” అంటూ నవ్వేసిన త్రిష:

అంతేకాదు, రానాను చాలామంది “లేడీస్ మ్యాన్” అని పిలవడంపై కూడా ఆమె సరదాగా స్పందించింది. “అతడు లేడీస్ మ్యానే” అని నవ్వుతూ చెప్పింది. “అందులో ఎలాంటి సందేహం లేదు. అది పూర్తిగా నిజమే” అంటూ నవ్వుతూ స్పందించడం హైలైట్‌గా మారింది.

also read:Bandla Ganesh: ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్!

- Advertisement -
Advertisement

రానా గురించి త్రిష ప్రశంసలు:

అయితే అదే సమయంలో రానా ఎంత మంచి వాడో కూడా చెప్పుకొచ్చింది. రానా ఎంత పెద్ద సినీ కుటుంబానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఎప్పుడూ గర్వంగా ప్రవర్తించడని, అందరితో సరదాగా ఫ్రెండ్షిప్ చేస్తాడని, చాలా మంచి మనసున్న వ్యక్తి అని పొగిడేసింది. అందరితో మర్యాదగా మాట్లాడడం, గౌరవంగా ప్రవర్తించడం తనలో తనకు నచ్చిన విషయం అని త్రిష చెప్పుకొచ్చింది.

‘వర్షం’ సినిమాతో మొదలైన పరిచయం:

“వర్షం” సినిమా కోసం జరిగిన ఫోటోషూట్‌లోనే మా మొదటి పరిచయం అయింది అంటూ గుర్తు చేసుకున్న త్రిష, అప్పటి నుంచి ఇప్పటివరకు మా స్నేహబంధం కొనసాగుతూనే వచ్చింది అని చెప్పింది. “కొన్నిసార్లు “,” పడింది కానీ, (.) ఫుల్‌స్టాప్ మాత్రం ఎప్పుడూ పడలేదు. ముగిసిపోయిన సందర్భం ఎప్పుడూ లేదు” అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం త్రిష మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you