Monday, August 24, 2026
HomeLATESTVaranasi:రాజమౌళి మరో సంచలనం.. 50 భాషల్లో ఒకేసారి ‘వారణాసి’ రిలీజ్..!

Varanasi:రాజమౌళి మరో సంచలనం.. 50 భాషల్లో ఒకేసారి ‘వారణాసి’ రిలీజ్..!

Varanasi:దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Varanasi:సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అన్న పేరుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. రాజమౌళి పేరు చెప్తే చాలు ఆటోమేటిగ్గా గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఆయన తెరకెక్కించిన సినిమాలు చూస్తే వేరే ఫీలింగ్‌లోకి వెళ్లిపోతాం. ఏ సినిమాను తెరకెక్కించినా జనాలకు బాగా నచ్చే విధంగా డైరెక్ట్ చేయడం ఆయన స్పెషాలిటీ. ‘ఆర్ఆర్ఆర్’తో ఆస్కార్ గడపకు టాలీవుడ్‌ను తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే దక్కింది.

అందుకే ఆయన దర్శకత్వంలో వస్తున్న ‘వారణాసి’పై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ కూడా నెలకొంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నాడు. రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇక మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రా కనిపించబోతుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ విజువల్స్ ఆల్రెడీ వచ్చేశాయి. రీసెంట్‌గా ఆమె పుట్టినరోజు కోసం రిలీజ్ చేసిన పోస్టర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది. భారీ జైప్ వచ్చేసింది.

- Advertisement -
Advertisement

విలన్ పాత్రలో పృథ్వీరాజ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్:

ఇక హైలెట్ ఏంటంటే.. ఈ సినిమాలో విలన్‌గా నటించబోతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ క్యారెక్టర్‌లో ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయనటువంటి సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఎన్నెన్నో ఉన్నాయి అన్న న్యూస్ బయటకు వచ్చింది. ఇది చాలా జోరుగా వైరల్ అవుతుంది. ఇప్పుడు మరొక సర్‌ప్రైజింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది.

also read:Nithya Menon:ఫైనల్లీ..నిత్యా మీనన్ పెళ్లికి చేసుకోబోతుందోచ్..? అబ్బాయి ఎవరంటే..?

- Advertisement -
Advertisement

50 దేశాల్లో ఒకేసారి ‘వారణాసి’ రిలీజ్?:

50 దేశాల్లో ఒకేసారి సమాంతరంగా ‘వారణాసి’(Varanasi) సినిమాను విడుదల చేసే విధంగా ప్లాన్ చేశారట రాజమౌళి. మామూలుగా ఇప్పుడున్న టెక్నాలజీతో మహేష్ బాబుని అన్ని లాంగ్వేజెస్‌లో మాట్లాడేలా చేసేయొచ్చు. కానీ రాజమౌళికి అలాంటి విషయంలో నమ్మకం ఉండదు. ఆయన ఏ పని చేసినా సరే.. ది పర్ఫెక్ట్‌గా చేయాలి అనుకుంటారు.

also read:Hero Ajith:రేసింగ్ లో హీరో అజిత్ కి ప్రమాదం!

- Advertisement -
Advertisement

డబ్బింగ్ కోసం భారీగా ఆడిషన్స్:

అందుకే ఒరిజినల్ డబ్బింగ్ ఆర్టిస్టులను ఎంపిక చేసుకోబోతున్నారట. సుమారు 1500 మందిని పిలిపించి త్వరలోనే ఆడిషన్స్ కూడా నిర్వహించబోతున్నారు అంటూ తెలిసింది. గొంతులో ఏ ఆర్టిస్టుకు ఎవరెవరు సెట్ అవుతారో కాచి వడబోసి ఫైనల్ చేసే పనిలో బిజీ అయిపోతున్నారు రాజమౌళి. ఇది చాలా చాలా శ్రమతో కూడుకున్న పని అని అందరికీ తెలిసిందే. అలాంటి పనులు చేయడం రాజమౌళికి చాలా చాలా ఇష్టం. కష్టమైన పనిని ఇష్టంగా చేసి సక్సెస్ అవ్వడమే రాజమౌళి స్పెషాలిటీ. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

‘వారణాసి’పై భారీ అంచనాలు:

ఒక్క రూపాయి అవుట్‌పుట్ కోసం వంద రూపాయలైనా ఖర్చు పెట్టడానికి రెడీ అయ్యే రాజమౌళి.. ఈ సినిమా కోసం ఇంకా ఇంకా డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నాడు అంటూ రీసెంట్‌గా న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అర్థం అయిపోయింది. చూడాలి మరి రాజమౌళి ‘వారణాసి’తో ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేస్తాడు అనేది…???

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you