Kaaka Movie:మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్టు కాకా. ఈ సినిమా నుంచి కేవలం టైటిల్ గ్లింప్స్ మాత్రమే విడుదల అయింది. దీంతో సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేయబోతున్నారని చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది. ఇందులో చిరంజీవి కూతురు పాత్రలో అనస్వర రాజన్ నటిస్తోంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి రాలేదంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, రచయిత అయిన కోన వెంకట్ రూమర్స్ కి సైతం పుల్ స్టాప్ పెట్టారు.
కాకా మూవీ వాయిదాపై నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్..
సంక్రాంతి రేసు నుంచి కాకా(Kaaka Movie) సినిమా తప్పుకుంటుంది అంటూ వస్తున్న తప్పుడు వార్తలను కొట్టేశారు. ఇప్పుడు ఈ విషయంపై సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. ఇలాంటి ఫేక్ రూమర్స్ కు రెస్ట్ ఇన్ పీస్.. మిమ్మల్ని నిరాశ పరుస్తున్నందుకు సారీ.. కాకా సినిమా జనవరి 13న ల్యాండ్ అవుతుందంటూ గట్టి కౌంటర్ వేశారు. చిరంజీవి నటించిన మరో చిత్రం విశ్వంభర.ఈ సినిమా జనవరి 13న రాబోతోందని, అందుకే కాకా చిత్రం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా వార్తలు వినిపించాయి.
also read:Surekha Vani :25 ఏళ్ల కుర్రాడితో సురేఖ వాణి ఎఫైరా..?
జనవరి 13న పక్కా విడుదల..
రెండు చిత్రాలు ఒకేసారి విడుదల అయితే మెగా వర్సెస్ మెగా క్లాస్ ఉండకూడదనే ఉద్దేశంతోనే కాకా చిత్రం వాయిదా పడుతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టారు కోన వెంకట్. చెప్పిన ముహూర్తానికే జనవరి 13న పక్కాగా థియేటర్లోకి అడుగుపెడుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో మెగా అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కేబీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
also read:Renu Desai:పవన్ కళ్యాణ్ తో విడాకులపై రేణూ దేశాయ్ ఏమందంటే?
రెండు విభిన్నమైన పాత్రలలో..
ఒకటి సూపర్ వైజర్ సత్య , మరొకటి కదిరి కాళిదాస్ అనే రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారట.. అమ్ములు పాత్రలో యువ నటి అనస్వర రాజన్ నటిస్తోంది. అలాగే కీలకమైన పాత్రలో మరో హీరోయిన్ నివేదా పేతురాజ్ నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇక కాకా సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేవని చెప్పడంతో మెగా అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్లు కూడా రాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఒక చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇప్పటివరకు ఆ సినిమాకి సంబంధించి మళ్లీ ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. వచ్చే ఏడాది విశ్వంభర చిత్రాన్ని విడుదల చేసేలా డైరెక్టర్ వశిష్టతో ప్లాన్ చేస్తున్నారు.
Once again – Rest in Peace all the rumours, all fake news, all the baseless articles about “KAAKA” –
Sorry to disappoint you but we are landing on Jan 13th 🚀సంక్రాతికి “కాకా” వస్తున్నాడు 🔥
అసలైన పండగ తెస్తున్నాడు 🕺@dirbobby @KvnProductions https://t.co/M1q3I9QH4g
— KONA VENKAT (@konavenkat99) November 6, 2026




