Sunday, November 8, 2026
HomeLATESTTeja Sajja:తేజ సజ్జా పెళ్లి సందడి షురూ.. వైరల్ గా మారిన వెడ్డింగ్ ఇన్విటేషన్..!

Teja Sajja:తేజ సజ్జా పెళ్లి సందడి షురూ.. వైరల్ గా మారిన వెడ్డింగ్ ఇన్విటేషన్..!

Teja Sajja: యువ నటుడు తేజ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ మేరకు ఆయన పెళ్లి పత్రిక సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

on
- Advertisement -banner Ad

Teja Sajja:గడిచిన కొద్దిరోజుల నుంచి టాలీవుడ్ లో యంగ్ హీరో తేజ సజ్జా వివాహం జరగబోతోంది అంటూ వార్తలు వినిపించాయి. ఈ విషయం పైన తేజ కూడా స్పందించారు. ఇప్పుడు తాజాగా అందుకు సంబంధించి కార్యక్రమాలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. వరుస సినిమాలతో కెరియర్ లో దూసుకుపోతున్న తేజ సజ్జా ఇప్పుడు తన జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే తన పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు. ప్రస్తుతం వివాహ వేడుకకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

తెలంగాణ సీఎంకు వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చిన తేజ సజ్జ..

ఇటువంటి క్రమంలోనే నవంబర్ 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా కలిసి తన నిశ్చితార్థ వేడుకకు హాజరు కావాలని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. సినిమాలతో పాటుగా వ్యక్తిగత జీవితంలో కీలకమైన ఘట్టానికి సిద్ధమవుతున్న తేజ సజ్జా కు అభిమానులు సైతం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తేజ సజ్జా వివాహం డిసెంబర్లో రాజస్థాన్లో ఉదయపూర్ ప్రాంతంలో జరగనుందట. నవంబర్లో ఎంగేజ్మెంట్ వేడుక ఉంటుందని, ఇది కుటుంబ సభ్యులు , సన్నిహితుల మధ్య చాలా సింపుల్ గా జరగబోతున్నట్లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement

also read:Kaaka Movie:కాకా విడుదల వాయిదాపై క్లారిటీ ఇచ్చిన కోన వెంకట్..!

ఉదయ్ పూర్ లో వివాహం..

ఉదయ్ పూర్ లో రాజసంగా వివాహ వేడుకలు నిర్వహించి, అనంతరం హైదరాబాదులో సినీ ప్రముఖులు , స్నేహితుల కోసం గ్రాండ్గా ఒక రిసెప్షన్ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు తేజ సజ్జా(Teja Sajja) చేసుకోబోయే అమ్మాయి గురించి ఎలాంటి విషయాలు బయటకి రాలేదు.. కానీ వినిపిస్తున్న ప్రకారం ఇది పెద్దలు కుదిర్చిన వివాహం అని, కాబోయే భార్య కుటుంబానికి, సినీ పరిశ్రమకు ఎలాంటి సంబంధం లేదని, వారు టెక్నాలజీ వ్యాపార రంగంలో ఉన్నట్లుగా వినిపించాయి. అయితే ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు మాత్రం ఇంకా అధికారికంగా బయటపడలేదు.

- Advertisement -
Advertisement

also read:Surekha Vani :25 ఏళ్ల కుర్రాడితో సురేఖ వాణి ఎఫైరా..?

తేజ సజ్జా సినిమాలు.

తేజ సజ్జా సినిమాల విషయానికి వస్తే.. మొదట చైల్డ్ యాక్టర్ గా ఎన్నో చిత్రాలలో నటించి, మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. జాంబిరెడ్డి, హనుమాన్, మిరాయ్ వంటి చిత్రాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న తేజ సజ్జా.. ప్రస్తుతం ది ట్రైటర్స్ రియాలిటీ షోకి హోస్ట్ గా వ్యవహరించారు. అలాగే మరొకవైపు జాంబిరెడ్డి 2 , మిరాయ్ 2, హనుమాన్ 2 చిత్రాలలో కూడా నటించబోతున్నారు. మొత్తానికి ఒక వైపు సినిమాలు మరొకవైపు పెళ్లి సందడితో తేజా సజ్జా పేరు మరొకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి తన పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన ప్రకటిస్తారేమో చూడాలి మరి. ఇటీవలే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన చిన్ననాటి స్నేహితురాలని వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవల ఎంగేజ్మెంట్ సంబంధించి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you