Vivek Oberoi:తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన నటులలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తుంటారు. సినిమాలలో క్రూరమైన పాత్రలలో నటించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం గొప్ప మనసు చాటుకున్నారు. నితీష్ తివారి దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన చిత్రం రామాయణ. ఇందులో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీత పాత్రలో, యశ్ రావణుడిగా నటించారు. నవంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో నుంచి అద్భుతమైన టాకుతో దూసుకుపోతోంది. అయితే ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రంలో వివేక్ ఒబెరాయ్ నటించారు. ఇందుకు భారీ రెమ్యూనరేషన్ కూడా తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి.
రామాయణ రెమ్యూనరేషన్ తో గొప్ప సహాయం..
రామాయణం చిత్రంలో అద్భుతమైన పాత్ర పోషించిన వివేక్ ఒబెరాయ్(Vivek Oberoi) ఈ చిత్రానికి గాను 6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారు. అయితే ఈ మొత్తం డబ్బులలో ఒక్క రూపాయి కూడా తాను తీసుకోకుండా ప్రాణాంతక క్యాన్సర్ తో పోరాడుతున్న ఎంతోమంది నిరుపేద చిన్నారుల వైద్య ఖర్చులకోసం విరాళంగా ఇచ్చేశారు. తన పారితోషకం మొత్తంగా క్యాన్సర్ బాధిత పిల్లల సహాయ నిధికి ఇవ్వడంతో అటు అభిమానులు, పలువురు నెటిజన్స్ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
also read:Pooja Hegde:నా రూపం నాకే నచ్చేది కాదు.. ముక్కు, నవ్వుపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్!
50 మంది చిన్నారుల కోసం గొప్ప నిర్ణయం..
అంతేకాకుండా తన 50వ పుట్టినరోజు సందర్భంగా తీవ్రమైన క్యాన్సర్ తో బాధపడుతున్న 50 మంది చిన్నారుల చికిత్స ఖర్చులను కూడా తానే స్వయంగా భరిస్తానంటూ ప్రకటించారు.. ఈ నిర్ణయం పైన వివేక్ స్పందిస్తూ.. తాను మనస్ఫూర్తిగా విశ్వసించే ఒక సత్కార్యం కోసం ఈ మొత్తాన్ని అందించాలనుకున్నాను. బాధను అనుభవిస్తున్న చిన్నారుల చికిత్సకు ఈ డబ్బు ఉపయోగపడితే, అంతకుమించి సంతృప్తి ,ఆనందం నాకు ఎక్కడా ఉండదు అంటూ తెలియజేశారు. అందుకే రామాయణ ప్రాజెక్టు నుంచి వచ్చిన ఒక్క పైసా కూడా తాను తీసుకోలేదని తెలియజేశారు.
also read:Abhinaya Sri:పెళ్లి విషయంలో అభినయ శ్రీ కండిషన్స్ ఇవే.. అందుకే ఇంకా సింగిలా?
రామాయణంలో ఆయన పాత్ర వెనుక ఇంత కథ ఉందా?
భారతీయ సినిమా వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకు వెళ్లేలా రామాయణం సినిమాని రూపుదిద్దడం చాలా గర్వకారణంగా ఉందంటూ కొనియాడారు.. రామాయణం సినిమాలో వివేక్ పోషించిన పాత్ర విద్యుత్ జిహ్వుడు.. ఈ పాత్ర రామాయణ కథ గమనంలో చాలా కీలకమైన మలుపుగా మారుతుంది. వాల్మీకి రామాయణ గ్రంథం ప్రకారం.. విద్యుత్ జిహ్వుడు కాలకేయ వంశానికి చెందిన ఒక బలమైన రాక్షస రాజు.. రావణాసురుడి చెల్లెలు సూర్పనఖ భర్త. సామ్రాజ్య విస్తరణ సమయంలో రావణాసురుడికి విద్యుత్ జిహ్వుడు కి భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలోనే రావణుడి చేతిలో విద్యుత్ జిహ్వుడు మరణిస్తారు.. ఈ క్రమంలోనే తన భర్తను కోల్పోయి వితంతువుగా ఉన్న సూర్పనఖ మనశ్శాంతి కోసం దండకారణ్యంలో ఒంటరిగా సంచరిస్తుంది.. అక్కడే శ్రీరాముడిని చూసి మోహించడం , ఆపైన లక్ష్మణుడి చేతిలో ఆమె ముక్కు చెవులు తెగిపోవడం, ఆ తర్వాత సీతాపహరణ, లంకా దహనం, రామ రావణ మహా యుద్ధానికి దారితీస్తుంది. తెరపై విధ్వంసకర రాక్షసుడి పాత్రలో నటించిన వివేక్ ఒబెరాయ్, నిజజీవితంలో మాత్రం ఎంతోమందికి ప్రాణదాతగా మారారు.
Vivek Oberoi, who played the role of Vibhishana in Ramayana, surprised everyone with his generosity
Vivek donated his entire fee of ₹6 crore received for Ramayan to help cancer patients.
He has been helping cancer patients for many years.
Now the question is to Ranbir Kapoor and Yash… Can you both, who charge crores in fees, donate this much of your earnings to the needy?
Vivek has played the role of Vibhishana on screen, but what he has done in real life is no less than any big character
— Dr Priyanka (@Dr_Priyanka0) November 6, 2026




