Monday, September 14, 2026
HomeLATESTDhee 10 Raju: ఢీ - 10 విన్నర్ రాజుపై వేధింపుల కేసు!

Dhee 10 Raju: ఢీ – 10 విన్నర్ రాజుపై వేధింపుల కేసు!

Dhee 10 Raju: ఢీ 10 షో విన్నర్ రాజు లైంగిక ఆరోపణల కేసులో అరెస్ట్ అయ్యారు.. అంతేకాదు రిమాండ్ కి కూడా తరలించారు.

on
- Advertisement -banner Ad

Dhee 10 Raju: ప్రముఖ డాన్స్ రియాల్టీ షో ఢీ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ప్రముఖ డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన వారిలో రాజు కూడా ఒకరు. అయితే తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో రాజుని అరెస్టు చేసినట్లుగా వినిపిస్తోంది. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ రాజును అరెస్టు చేసినట్లు సమాచారం. అతని లైంగిక వేధింపులకు పాల్పడడమే కాకుండా సినిమా అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి, ఒక యువతిని మోసం చేశారని, ఆ యువతీ ఫిర్యాదుతో మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి ఢీ షో రాజుని అరెస్టు చేశారు.

ఢీ రాజు అరెస్ట్..

రాజుని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అనంతరం న్యాయస్థానం అతడిని రిమాండ్ కి కూడా తరలించినట్లు వినిపిస్తోంది. ఈనెల 9వ తేదీన ఒక యువతి మియాపూర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి అక్కడ ఢీ షో రాజు మీద కంప్లైంట్ ఇచ్చింది. తనను లైంగికంగా వేధిస్తున్నారని, సినీరంగంలో అవకాశాల పేరుతో వంచించాడంటూ ఫిర్యాదులో వెల్లడించింది. బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి మరీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు లభించడంతో వెంటనే రాజుని అరెస్టు చేసి మరి రిమాండ్ కు తరలించినట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ: OTT:వణికించే సీన్లు.. ఊహించని ట్విస్టులు.. జియోహాట్‌స్టార్‌లో 4 హారర్ థ్రిల్లర్స్!

లైంగిక ఆరోపణలతో కేసు ఫైల్..

అయితే ఆ యువతి చేసిన ఆరోపణలపైన పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటపడలేదు. మరి కంప్లైంట్ చేసిన ఆ యువతి ఎవరు అనే విషయం పైన కూడా చాలామంది నేటిజన్స్ తెగ వెతికేస్తున్నారు. ఈ కేసు గడచిన మూడు రోజుల క్రితం నమోదైనట్లుగా తెలుస్తోంది . ఈ వ్యవహారం బయటకి రాకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఢీ షో రాజు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఢీ షో డాన్సర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న రాజు పలు రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఢి 10 విన్నర్ గా కూడా నిలిచిన రాజు ఇటీవలే ఢి 20 సీజన్ టైటిల్ కూడా కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -
Advertisement

ALSO READ:SIIMA Awards 2026: అవార్డులు కొల్లగొట్టిన స్టార్స్ వీళ్లే.. పూర్తి విజేతల లిస్ట్ ఇదే!

రాజు స్పందిస్తారా?

మరి ఈ విషయం పైన రాజు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి బుల్లితెరపై తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న రాజు సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక వీడియోతో వైరల్ గా మారుతున్నారు. మరి అలాంటి రాజు పైన లైంగిక వేధింపులు కేసు నమోదు అయినట్లు తెలియడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you