Wednesday, July 8, 2026
HomeLATESTColors Swathi: రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి!

Colors Swathi: రెండో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ కలర్స్ స్వాతి!

Colors Swathi: ప్రముఖ హీరోయిన్ కలర్స్ స్వాతి సైలెంట్ గా రెండో పెళ్లి చేసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

on
- Advertisement -banner Ad

Colors Swathi: టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్లలో కలర్ స్వాతి కూడా ఒకరు. కలర్స్ స్వాతి తెలుగు అమ్మాయిగా కలర్స్ ప్రోగ్రాం తో యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత 2005లో డేంజర్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అష్టా చమ్మా సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కలర్స్ స్వాతి స్వామి రారా, కార్తికేయ, గోల్కొండ హై స్కూల్, పంచతంత్రం తదితర చిత్రాలలో హీరోయిన్గా నటించి తెలుగు అమ్మాయిగా ముద్ర వేసుకుంది.

సైలెంట్ గా పెళ్లి చేసుకున్న కలర్స్ స్వాతి..

అనంతరం కలర్స్ స్వాతి (Colors Swathi)2018లో వికాస్ వాసు అనే పైలెట్ ని ప్రేమించి వివాహం చేసుకుంది. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకున్న విషయాన్ని కూడా బయట చెప్పలేదు స్వాతి. ఈ విషయం పైన తాను మాట్లాడడానికి కూడా ఇష్టపడనని తెలియజేసింది. గత కొద్దిరోజులుగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న స్వాతి తాజాగా రెండో వివాహం చేసుకొని సడన్ షాక్ ఇచ్చింది. అది కూడా టాలీవుడ్ దర్శకుడితో కావడం గమనార్హం. తమ పెళ్ళికి సంబంధించిన ఫోటోలను కలర్స్ స్వాతిని స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేసింది.

- Advertisement -

also read:Vijay:సొంత సినిమాకే కఠినమైన నిర్ణయం తీసుకున్న సీఎం విజయ్..!

పెళ్లి కొడుకు ఎవరంటే?

పెళ్లి దుస్తులలో తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ పెళ్లి చేసుకున్నామంటూ ఒక క్యాప్షన్ జోడించి . తన భర్త ఇంస్టాగ్రామ్ అకౌంట్ను కూడా ట్యాగ్ చేసింది స్వాతి. ఇందుకు సంబంధించి ఫోటోలు కూడా వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. స్వాతి వివాహం చేసుకున్న డైరెక్టర్ పేరు శ్రీకాంత్ నాగోతి. స్వాతి ప్రధాన పాత్రలో నటించినటువంటి మంత్ ఆఫ్ మధు మూవీకి ఈయన దర్శకుడుగా పనిచేశారు. అయితే ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించిందని, ఆ ప్రేమను జులై 8 న వివాహ బంధంతో ఒక్కటి చేశారు అని తెలుస్తోంది.

- Advertisement -

also read:Kiraak RP: అందుకే కిర్రాక్ ఆర్పీ చేపల పులుసు దుకాణం మూసివేశారా?

మళ్లీ సినిమాలలో నటిస్తుందా?

వీరి వివాహం ఇంట్లోనే చాలా సింపుల్ గా జరిగినట్లు ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. ఈ ఫోటోలు చూసిన అభిమానులు , సినీ ప్రముఖులు సైతం ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. విడాకుల అనంతరం పలు రకాల సినిమాలలో వెబ్ సిరీస్లలో నటించిన కలర్స్ స్వాతి మరి రెండవ వివాహం అనంతరం సినిమాలలో నటిస్తుందో లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

- Advertisement -

 

View this post on Instagram

 

A post shared by Swati (@swati194)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you