Saturday, October 3, 2026
HomeLATESTactress Sarada:నడవలేని స్థితిలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

actress Sarada:నడవలేని స్థితిలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

actress Sarada: ఊర్వశి శారదాగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ శారద తాజాగా ఒక రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో నడవలేని స్థితిలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

on
- Advertisement -banner Ad

actress Sarada:టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు సీనియర్ హీరోయిన్గా ఎంతోమంది హీరోలకు జోడిగా నటించి ఎన్నో చిత్రాలలో తనదైన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సీనియర్ నటి శారద కూడా ఒకరు. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయిన తర్వాత ఈమె ఎక్కువగా అమ్మ పాత్రలలో, నానమ్మ పాత్రలలో అద్భుతంగా నటించింది. టాలీవుడ్ స్టార్ హీరోలకు తల్లిగా కూడా నటించిన శారద.. గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె చెన్నైలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది.

నడవలేని స్థితిలో సీనియర్ హీరోయిన్ శారద..

సీనియర్ హీరోయిన్ శారద బయట కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పుడప్పుడు ఏదైనా వేడుకలలో కనిపించడం తప్ప పెద్దగా ఎక్కడ కనిపించదు. తాజాగా ఈమె ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందుకు సంబంధించి ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .అయితే ఈ వీడియోలో శారద గారు నడవలేని పరిస్థితి చూసి అభిమానులు ఒకసారిగా షాక్ కి గురవుతున్నారు. శారద చెన్నైలో దీపు టు రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి హాజరు కాగా.. ఇందులో భాగంగా ఆమె తన చేతులు మీదుగా జ్యోతి వెలిగించి మరీ రెస్టారెంట్ ను ప్రారంభించారు .ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Akshara Hassan:పదవ తరగతి మూడుసార్లు ఫెయిల్ అయిన టాప్ హీరో కూతురు..!

వైరల్ గా మారిన వీడియో..

ఈ వీడియోలో శారద(actress Sarada) ఇతరుల సహాయంతో నిలబడి ఉన్నట్టు కనిపిస్తోంది. అలాగే తన చేతులు మొత్తం వణుకుతూ కనిపించడమే కాకుండా, గుర్తుపట్టలేనంతగా మారిపోయింది శారద. ఇతరుల సహాయం లేనిదే నడవలేని పరిస్థితిలో కనిపించిన శారదాను చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఒకప్పుడు తెలుగు , తమిళ భాషలలో వరుస సినిమాలలో నటించి ఒక వెలుగు వెలిగిన సీనియర్ హీరోయిన్ శారద వయసు పైబడడంతో పాటుగా , అనారోగ్య సమస్యల వల్ల నడవలేని పరిస్థితిలో ఉందేమో అంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Kayadu Lohar: క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో మదిని దోచిన కయాదు లోహర్!

శారద సినిమా కెరియర్..

సీనియర్ హీరోయిన్ శారద కెరియర్ విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు సరస్వతి దేవి . ఈమె ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన అమ్మాయి. ఈమె సినిమాల పైన ఇష్టం ఉండడంతో 1955లో విడుదలైన తెలుగు చిత్రం కన్యాశుల్కం ద్వారా సినీ కెరియర్ని మొదలు పెట్టింది. బాలనటిగా తన కెరీయర్ని మొదలుపెట్టి హీరోయిన్ గా కొనసాగుతూ తమిళ్ , తెలుగు, మలయాళం వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలలో నటించింది. శారద తన కెరీర్లు మూడు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకోవడమే కాకుండా ఎన్టీఆర్ జాతీయ పురస్కార అవార్డులతో పాటు మరో కొన్ని అవార్డులను కూడా అందుకుంది . సినీ ఇండస్ట్రీలో వందల సినిమాలలో నటించిన సీనియర్ హీరోయిన్ శారద రాజకీయాల విషయానికి వస్తే.. టిడిపి పార్టీలో చేరి. 1996 నుంచి 1998 వరకు ఎంపీగా బాధ్యతలను నిర్వహించారు. తాజాగా శారదా కి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you