Saturday, October 3, 2026
HomeLATESTRachita Ram:రచితా రామ్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్..!

Rachita Ram:రచితా రామ్ బుగ్గ గిల్లిన అభిమాని.. వీడియో వైరల్..!

Rachita Ram: హీరోయిన్ రజిత రామ్ను కలవడానికి వచ్చిన ఒక అభిమాని ఆమెతో ఫోటో దిగడమే కాకుండా ఆమె బుగ్గలు గిల్లడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

on
- Advertisement -banner Ad

Rachita Ram:సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలకు కొన్ని సందర్భాలలో ఎదురైన వింత అనుభవాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అలా ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న నటి రచితా రామ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం ఏదో ఒక విషయంలో వార్తలలో నిలుస్తూనే ఉంది. అక్టోబర్ మూడవ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకోవడానికి వచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఒక అభిమాని నుంచి ఊహించని రీతిలో ఒక షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వైరల్ చేస్తున్నారు అభిమానులు.

హీరోయిన్ బుగ్గలు గిల్లిన అభిమాని..

రచితా రామ్(Rachita Ram) ప్రతి ఏడాది తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులను కలుసుకొనే అలవాటు ఉన్నది. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు కూడా భారీగా అభిమానులు తరలివచ్చారు. అంతేకాకుండా ఆమెతో సెల్ఫీలు దిగుతూ, మరి కొంతమంది వీడియోలు తీస్తూ ఉంటూ కొంత సమయం అభిమానులతో గడిపింది. అయితే ఈ క్రమంలోనే ఒక అభిమాని చేసిన పనికి మాత్రం అవాక్కయ్యేలా కనిపిస్తున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. రచితా రామ్ దగ్గరికి వచ్చి ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ తీసుకున్నారు. అనంతరం ఆమెకు షేక్ అండ్ ఇచ్చి అక్కడితో ఆగకుండా రచితా రామ్ రెండు బుగ్గలను పట్టుకొని గిల్లాడు.

- Advertisement -
Advertisement

also read:actress Sarada:నడవలేని స్థితిలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..?

హీరోయిన్ రియాక్షన్ అదుర్స్..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు కూడా వైరల్ గా చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రచితా రామ్ ఏం చేయాలో తెలియక చిన్న నవ్వు నవ్వి వదిలేసింది. ఈ విషయం పైన నెటిజన్స్ మాత్రం సరదా ఫ్యాన్ మూమెంట్ అంటూ కామెంట్ చేయగా మరి కొంత మంది ఆ అభిమాని ప్రవర్తన పైన అసంతృప్తిని తెలియజేస్తున్నారు. అభిమానులు బుగ్గలను పట్టుకొని గిల్లిన తరువాత కూడా ఆమె క్యూట్ గా నవ్వుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులు తమకు ఇష్టమైన సెలబ్రిటీలను కలిస్తే ఇలాంటివి చేయడం చేస్తూ ఉంటారు.

- Advertisement -
Advertisement

also read:Akshara Hassan:పదవ తరగతి మూడుసార్లు ఫెయిల్ అయిన టాప్ హీరో కూతురు..!

రచితా రామ్ కెరియర్..

వాస్తవంగా సెలబ్రెటీల వ్యక్తిగత హద్దులను ప్రతి ఒక్కరు కూడా గౌరవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆమె అనుమతి లేకుండా శారీరకంగా తాకడం కూడా సరైన పద్ధతి కాదంటూ ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రచితా రామ్ ప్రధానంగా కన్నడ సినిమాలతో బాగా పాపులారిటీ సంపాదించింది . ఈమె తెలుగు, తమిళ చిత్రాలలో కూడా నటించింది. తెలుగులో సూపర్ మచ్చి వంటి చిత్రాలను నటించిన ఈ ముద్దుగుమ్మ దక్షిణాది భాషలలో కూడా తన మార్క్ చూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.. అలాగే రజనీకాంత్ నటించిన కూలి చిత్రంతో కూడా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. రచితా రామ్ సంబంధించిన ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you