Friday, September 11, 2026
HomeLATESTFriday ott movies: ఓటీటీ రిలీజ్‌లు.. ఈ 6 సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు

Friday ott movies: ఓటీటీ రిలీజ్‌లు.. ఈ 6 సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు

Friday ott movies:సినీప్రియులకు ఈ శుక్రవారం ఓటీటీలో ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొదవలేదు. సెప్టెంబర్ 11న పలు ఆసక్తికరమైన సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చాయి

on
- Advertisement -banner Ad

Friday ott movies:వీకెండ్ వచ్చిందంటే చాలు.. కొత్త సినిమాల కోసం థియేటర్లకు వెళ్లే వారితో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై ఏం కొత్తగా వచ్చిందో వెతికే ప్రేక్షకుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున పలు కొత్త చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వస్తుంటాయి. సెప్టెంబర్ 11, శుక్రవారం(Friday ott movies) కూడా ప్రేక్షకులను అలరించేందుకు వివిధ భాషలకు చెందిన సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. వీటిలో ఆసక్తికరమైన కథాంశాలతో ఉన్న ఆరు సినిమాలపై ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో సూర్య ‘విశ్వనాథ్ & సన్స్’ :

తమిళ స్టార్ హీరో సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఫ్యామిలీ డ్రామా ‘విశ్వనాథ్ & సన్స్’ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సంజయ్ విశ్వనాథ్ అనే వ్యాపారవేత్త జీవితంలోకి మెడికల్ విద్యార్థిని మ్యాడీ రావడంతో అతని కుటుంబంలో చోటుచేసుకునే మార్పులే కథకు ప్రధానాంశం. సూర్యకు జోడీగా మమితా బైజు నటించగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో కనిపించారు.

- Advertisement -
Advertisement

జీ5లో ‘పంచనామా’ :

సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడేవారికి ‘పంచనామా’ మంచి ఆప్షన్. ఓ చిన్నారి అనుమానాస్పద మరణం వెనుక ఉన్న నిజాన్ని బయటపెట్టేందుకు పోలీస్ అధికారి జై చేసే దర్యాప్తు చుట్టూ కథ సాగుతుంది. కేసును త్వరగా ముగించాలనుకునే అధికారుల ఒత్తిడిని ఎదుర్కొంటూ, దాని వెనుక దాగి ఉన్న మెడికల్ క్రైమ్‌ను వెలుగులోకి తీసుకురావడానికి అతను చేసే ప్రయత్నాలు ఆసక్తిని పెంచుతాయి.

also read:Kalanithi maran:డీసీ సినిమా భారీ విజయం. లోకేష్ కి కళానిధి మారన్ కారు గిఫ్ట్..!

- Advertisement -
Advertisement

అమెజాన్ ప్రైమ్ వీడియోలో విశాల్ ‘మకుటం’ :

యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు విశాల్ నటించి, దర్శకత్వం వహించిన ‘మకుటం’ అందుబాటులోకి వచ్చింది. ఇందులో విశాల్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఓ విషాద ఘటన తర్వాత వారి మధ్య ఏర్పడే సంఘర్షణే కథకు కీలకం. దుషారా విజయన్, అంజలి ఇందులో హీరోయిన్లుగా నటించారు.

also read:Samantha: సమంత ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్ ఏంటో తెలుసా..?

- Advertisement -
Advertisement

ఈటీవీ విన్‌లో ‘కొలవెరి’ :

తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ‘కొలవెరి’ స్ట్రీమింగ్ అవుతోంది. బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు హైకింగ్‌కు వెళ్లిన విక్రమ్‌కు అనుకోకుండా తన మాజీ ప్రేయసి ఎదురవుతుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకునే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ నడుస్తుంది. రవితేజ ముక్కవల్లి, శ్రావ్య సామల ప్రధాన పాత్రల్లో నటించారు.

జీ5లో ‘వరవు’ :

మలయాళ స్టార్ జోజు జార్జ్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘వరవు’ కూడా జీ5లోకి వచ్చింది. కుటుంబంలో చోటుచేసుకున్న ఓ అదృశ్యం, గత శత్రుత్వాల నేపథ్యంలో కథ సాగుతుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

జియో హాట్‌స్టార్‌లో ‘ప్రిన్స్ ఆఫ్ మోలీవుడ్’ :

సినీ రంగంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించే ఓ యువకుడు, అతని ధనిక తండ్రి మధ్య జరిగే సంఘర్షణతో రూపొందిన కామెడీ డ్రామా ‘ప్రిన్స్ ఆఫ్ మోలీవుడ్’. ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you