Friday, September 11, 2026
HomeLATESTMounika shiva:అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన బ్యూటి..గుర్తుపట్టారా..?

Mounika shiva:అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్..ఇప్పుడు హీరోయిన్ రేంజ్ కి ఎదిగిన బ్యూటి..గుర్తుపట్టారా..?

Mounika shiva:ఒకప్పుడు చిన్నారిగా సినిమాల్లో కనిపించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

on
- Advertisement -banner Ad

Mounika shiva:సినిమా ఇండస్ట్రీలో చిత్ర విచిత్రాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి ఎప్పటికప్పుడు మనం సోషల్ మీడియా వేదికగా తెలుసుకుంటూనే ఉంటాం. రీసెంట్‌గా సోషల్ మీడియాలో మాత్రం ఓ న్యూస్ ట్రెండ్ అవుతుంది. ఇది తెలుసుకున్న అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఖైదీ సినిమాలో కార్తీ కూతురుగా మౌనిక :

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. ఈ సినిమా ఎంత పెద్ద సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఇందులో హీరో కార్తీ పెర్ఫార్మెన్స్ మాత్రం వేరే లెవెల్. ఇప్పటికీ ఆయనను చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే. అలా ఉంటుంది ఆయన పెర్ఫార్మెన్స్. ఇందులో తండ్రి, కూతురు సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా హైలైట్ అయింది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు.

- Advertisement -
Advertisement

అప్పట్లో చిన్న పాపగా కనిపించిన మౌనిక :

అందులో కార్తీ కూతురు పాత్రలో నటించిన చిన్నారి పేరు మౌనిక శివ(Mounika shiva). తన అమాయకత్వం, తన సహజసిద్ధమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘ఖైదీ’ సినిమా విడుదలైన సమయంలో మౌనిక ఐదో తరగతి చదువుతున్న చిన్న పాప మాత్రమే. ఆ సమయంలో దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ మూవీలో తన నటన మాత్రమే హైలైట్ చేశారు.

also read:Friday ott movies: ఓటీటీ రిలీజ్‌లు.. ఈ 6 సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు

- Advertisement -
Advertisement

ఇప్పుడు హీరోయిన్‌కు మించిన కటౌట్‌తో :

‘ఖైదీ’ సినిమా రిలీజ్ సమయంలో అమాయకంగా కనిపించిన ఈ అమ్మాయి ఇప్పుడు పెద్దది అయిపోయింది. ఇప్పుడు హీరోయిన్‌కు మించిన కటౌట్‌తో అదరగొట్టేస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో మౌనిక షేర్ చేసిన కొన్ని ఫొటోలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. అప్పటి అమాయకపు లుక్ నుంచి ఇప్పుడు ట్రెండీగా మారిన గ్లామరస్ మేకోవర్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

also read:Kalanithi maran:డీసీ సినిమా భారీ విజయం. లోకేష్ కి కళానిధి మారన్ కారు గిఫ్ట్..!

- Advertisement -
Advertisement

గుర్తుపట్టలేకపోతున్నామంటూ కామెంట్స్ :

“నువ్వేనా? నిజంగా నువ్వేనా? ఇది ‘ఖైదీ’లో కార్తీ కూతురుగా నటించింది నువ్వేనా? అస్సలు గుర్తుపట్టలేకపోతున్నాం” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇతర సినిమాల్లోనూ నటించిన మౌనిక :

మౌనిక కేవలం ‘ఖైదీ’లోనే కాదు.. తమిళ, మలయాళ భాషల్లో కూడా నటించింది. నయనతార నటించిన ‘రాక్షసన్’, అదేవిధంగా విజయ్ ‘భైరవ’, అజిత్ ‘వేదాళం’ సినిమాల్లో కూడా ఆమె తనదైన స్టైల్‌లో నటించి మెప్పించింది. కానీ బాగా గుర్తింపు తెచ్చింది మాత్రం ‘ఖైదీ’ అనే చెప్పాలి.

హీరోయిన్‌గా మారిపో అంటూ కామెంట్స్ :

ప్రస్తుతం ప్లస్ టూ చదువుతున్న మౌనిక రీసెంట్‌గా షేర్ చేసిన ఫొటోలు బాగా వైరల్‌గా మారాయి. “ఇంకెందుకు ఆలస్యం.. హీరోయిన్‌గా మారిపో” అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం “ఇది హీరోయిన్ కటౌట్.. గుడ్ ఆల్ ద బెస్ట్” అంటూ విషెస్ అందిస్తున్నారు.

మౌనిక గ్లామర్ అండ్ ట్రెండీ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొంతమంది “ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తుంది.. పక్కా” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by monekha siva (@monicasiva_offl)

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you