Monday, September 14, 2026
HomeLATESTSIIMA Awards 2026: అవార్డులు కొల్లగొట్టిన స్టార్స్ వీళ్లే.. పూర్తి విజేతల లిస్ట్ ఇదే!

SIIMA Awards 2026: అవార్డులు కొల్లగొట్టిన స్టార్స్ వీళ్లే.. పూర్తి విజేతల లిస్ట్ ఇదే!

SIIMA Awards 2026 వేడుకలు బెంగళూరులో ఘనంగా జరిగాయి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు వివిధ కేటగిరీల్లో అవార్డులను అందుకున్నారు.

on
- Advertisement -banner Ad

SIIMA Awards 2026: దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA Awards 2026)వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదికగా మారింది. తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి మరింత కళ తీసుకొచ్చారు.

తెలుగు, కన్నడ సినిమాలకు పురస్కారాలు :

రెండు రోజుల పాటు సాగే SIIMA అవార్డ్స్‌లో భాగంగా తొలి రోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన విజేతలకు పురస్కారాలను అందించారు. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కళాకారులను అవార్డులతో సత్కరించారు.

- Advertisement -
Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో ‘మిరాయ్’ సినిమాతో ఆకట్టుకున్న యువ హీరో తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో తన నటనకు ఐశ్వర్య రాజేశ్ ఉత్తమ నటి (క్రిటిక్స్) పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఇదే సినిమాలో బుల్లిరాజు పాత్రతో ప్రేక్షకులను అలరించిన భీమల రేవంత్ ఉత్తమ హాస్య నటుడిగా ఎంపికయ్యారు.

also read:Irumudi OTT: థియేటర్లలో దుమ్మురేపిన ఇరుముడి.. ఓటీటీలోకి ఎప్పుడంటే?

- Advertisement -
Advertisement

కన్నడ చిత్ర పరిశ్రమకు గుర్తింపు :

కన్నడ ఇండస్ట్రీ నుంచి ‘కాంతార: చాప్టర్ 1’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు. ఆయన నటనకు ఈ పురస్కారం లభించింది. దీంతో తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమల్లోని ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణులకు SIIMA వేదికపై మరోసారి ఘనమైన గుర్తింపు లభించింది.

also read:TV Movies: ఆదివారం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. టీవీలో వచ్చే సినిమాల లిస్ట్ ఇదే!

- Advertisement -
Advertisement

SIIMA Awards 2026 విజేతలు

ఉత్తమ నటుడు: తేజ సజ్జా – ‘మిరాయ్’
ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేశ్ – ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఉత్తమ సహాయ నటుడు: సత్యదేవ్ – ‘కింగ్డమ్’
ఉత్తమ సహాయ నటి: శ్రద్ధా శ్రీనాథ్ – ‘డాకు మహారాజ్’
ఉత్తమ హాస్య నటుడు: భీమల రేవంత్ – ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఉత్తమ నటుడు (పరిచయ): హర్ష్ రోషన్ – ‘కోర్ట్’
ఉత్తమ నటి (పరిచయ): శ్రీదేవి – ‘కోర్ట్’
ఉత్తమ నటి (పరిచయ): సాక్షి మడోల్కర్ – ‘మోగ్లీ’
ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి – ‘కోర్ట్’
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని – ‘మిరాయ్’
ఉత్తమ నేపథ్య గాయకుడు: రమణ గోగుల – ‘సంక్రాంతికి వస్తున్నాం’
ఉత్తమ నేపథ్య గాయని: సమీరా భరద్వాజ్ – ‘కోర్ట్’

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you