OTT:హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ఓటీటీ ప్రేక్షకులకు సెప్టెంబర్‌లో జియోహాట్‌స్టార్ మంచి కంటెంట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా సెప్టెంబర్ తొలి రెండు వారాల్లో నాలుగు ఆసక్తికరమైన హారర్, థ్రిల్లర్ సినిమాలు/సిరీస్‌లు స్ట్రీమింగ్కు వచ్చాయి. సైకలాజికల్ హారర్ నుంచి ఫాంటసీ అడ్వెంచర్ వరకు విభిన్న కాన్సెప్ట్‌లతో రూపొందిన ఈ కంటెంట్ ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు ఉత్కంఠకు(OTT) గురిచేస్తుంది. మరి ఆ నాలుగు ఏంటో చూద్దాం.
విజిల్ (Whistle) :
టీనేజ్ స్లాషర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ‘విజిల్’ సెప్టెంబర్ 4 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. కొందరు హైస్కూల్ విద్యార్థులకు ఓ పురాతన డెత్ విజిల్ దొరకడం, దాన్ని ఊదిన తర్వాత వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడటం చుట్టూ కథ సాగుతుంది. భయానక హత్యలు, సస్పెన్స్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ.
ది ఫ్రంట్ రూమ్ (The Front Room) :
సైకలాజికల్ బాడీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ది ఫ్రంట్ రూమ్’ సెప్టెంబర్ 7 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. గర్భవతి అయిన ఓ మహిళ ఇంటికి అత్తగారు రావడంతో ఆమె జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఆధ్యాత్మిక నమ్మకాలు, మానసిక వేధింపులు, భయపెట్టే సన్నివేశాలతో సినిమా ఉత్కంఠను పెంచుతుంది.
గెట్ అవుట్ (Get Out) :
ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సైకలాజికల్ హారర్ చిత్రం ‘గెట్ అవుట్’ సెప్టెంబర్ 8 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ నల్లజాతి యువకుడు తన ప్రియురాలి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన తర్వాత అక్కడ ఎదుర్కొనే వింత అనుభవాలే కథకు ప్రధానాంశం. జార్డన్ పీలే దర్శకత్వం, సామాజిక అంశాలను హారర్‌తో మేళవించిన తీరు ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి.
also read: SIIMA Awards 2026: అవార్డులు కొల్లగొట్టిన స్టార్స్ వీళ్లే.. పూర్తి విజేతల లిస్ట్ ఇదే!
అలీ బాబా ఔర్ 40 భూత్ :
రెగ్యులర్ అలీబాబా కథకు భిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ‘అలీ బాబా ఔర్ 40 భూత్’ సెప్టెంబర్ 11 నుంచి జియోహాట్‌స్టార్‌లో అందుబాటులోకి వచ్చింది. ఓ యువతి తన తండ్రి అదృశ్యానికి సంబంధించిన రహస్యాన్ని ఛేదించే క్రమంలో 40 శపించబడిన విగ్రహాలు, దెయ్యాల ప్రపంచం గురించి తెలుసుకుంటుంది. హారర్, ఫాంటసీ, కామెడీ కలయిక ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణ.
మొత్తంగా హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడేవారు జియోహాట్‌స్టార్‌లో ఈ నాలుగు సినిమాలు/సిరీస్‌లను తమ వాచ్‌లిస్ట్‌లో చేర్చుకోవచ్చు. వీటిలో ‘విజిల్’, ‘గెట్ అవుట్’ వంటి కంటెంట్ తెలుగు డబ్బింగ్లో అందుబాటులో ఉండటం విశేషం.




