Varanasi Movie:డైరెక్టర్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం వారణాసి. మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్ గా , మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7వ తేదీన భారీ అంచనాలతో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా విడుదల అవ్వడానికి ఇంకా 9 నెలల సమయం ఉన్నప్పటికీ, ఇప్పటినుంచి ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో రోజుకొక విషయం వైరల్ గా మారుతూనే ఉంది. ముఖ్యంగా ఈ సినిమా అఫీషియల్ కంటెంట్ కంటే షూటింగ్, కథ పాత్రలకు సంబంధించి ఏదో ఒక విషయం వైరల్ గా మారడంతో వారణాసి సినిమా పైన మరింత ఆసక్తి పెంచేలా చేస్తున్నాయి.
ఆ 30 నిమిషాలే సినిమాలో కీలకం..
ఇప్పుడు తాజాగా వారణాసి(Varanasi Movie) సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వైరల్ గా మారింది. వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.. రాజమౌళి మార్క్ యాక్షన్ అడ్వెంచర్ అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో సుమారుగా 30 నిమిషాల పాటు సాగే ఒక భారీ యుద్ధ సన్నివేశం ఉండబోతున్నట్లు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెన్స్ సినిమాలో చాలా కీలకమైన ఘట్టంగా నిలుస్తుందని సమాచారం.
also read:Sampoornesh Babu:సంపూర్ణేష్ బాబుకి క్షమాపణలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్..!
ఇండియాతో పాటు పలు దేశాలలో షూటింగ్..
అలాగే ఇందులో శ్రీరాముడు ప్రస్తావన కూడా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. వారణాసి సినిమా కథ ఒకే ప్రాంతానికి పరిమితం కాదని, మరో ప్రచారం కూడా కొనసాగుతోంది. కథలో భాగంగా భారత్ లోని వారణాసితో పాటుగా అంటార్కికా, ఆఫ్రికా, ప్రాచీన రోమ్ వంటి విభిన్నమైన ప్రాంతాలను కూడా టచ్ చేయబోతున్నట్లు సమాచారం. విభిన్న భౌగోళిక నేపథ్యాల కథతో ఈ చిత్రాన్ని రాజమౌళి భారీ స్థాయిలో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. సాధారణంగా ఇలాంటి చిత్రాలను రెండు భాగాలుగా తెరకెక్కించడం జరుగుతుంది.
also read:Tollywood:జైలు గోడపై టాప్ హీరో స్కెచ్..తెలుగు హీరో సినిమాపై ఫ్యాన్స్ ఫైర్!
రాజమౌళి ఆలోచనలు అందుకోవడం సాధ్యమేనా?
కానీ వారణాసి సినిమా విషయంలో మాత్రం అలాంటివి జరగడం లేదు. ఈ కథను రెండు భాగాలుగా కాకుండా ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకి రాజమౌళి తీసుకురాబోతున్నట్లు సమాచారం. ఇంత భారీ కథను ఒకే సినిమాలో రాజమౌళి ఎలా చెప్పబోతున్నారు. అసలు ఆ కథ ఏ స్థాయిలో ఉండబోతోంది? యాక్షన్ అడ్వెంచర్ తో పాటు పలు అంశాలను రాజమౌళి ఎలా ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేశారు అనే ప్రశ్నలు అభిమానులలో మరింత ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. మొదటిసారి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా పైన అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పటివరకు గ్లింప్స్, పోస్టర్లతో మాత్రమే అంచనాలు పెంచేసిన వారణాసి చిత్రం.. మరి రాబోయే రోజుల్లో టీజర్ ట్రైలర్‌తో ఎలాంటి అంచనాలను పెంచేస్తుందో చూడాలి. ఈ సినిమా టాలీవుడ్ పరిశ్రమని మరో స్థాయి పైకి తీసుకు వెళ్లేలా ఉంటుందనే విధంగా వినిపిస్తున్నాయి




