Friday, September 25, 2026
HomeLATESTSampoornesh Babu:సంపూర్ణేష్ బాబుకి క్షమాపణలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్..!

Sampoornesh Babu:సంపూర్ణేష్ బాబుకి క్షమాపణలు చెప్పిన సీనియర్ జర్నలిస్ట్..!

Sampoornesh babu: ప్రముఖ సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ను కించపరుస్తూ సీనియర్ జర్నలిస్టు కామెంట్స్ చేయగా.. ఇప్పుడు ఆయన క్షమాపణలు తెలియజేశారు.

on
- Advertisement -banner Ad

Sampoornesh Babu:నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన చిత్రం ది ప్యారడైజ్. సెప్టెంబర్ 24న భారీ అంచనాల మధ్య ఈ చిత్రం మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో పలువురు నటీనటులు నటించారు. ముఖ్యంగా బిర్యానీ అనే వైవిధ్యమైన పాత్రలో సంపూర్ణేష్ బాబు నటించి ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా సంపూర్ణేష్ బాబు పట్ల సీనియర్ జర్నలిస్టు వ్యవహరించిన తీరు చాలామంది అభిమానులను ఫైర్ అయ్యేలా చేసింది.

సంపూర్ణేష్ బాబును అవమానించిన జర్నలిస్ట్..

సీనియర్ విలేకరి నాగేంద్ర కుమార్ సంపూర్ణేష్ బాబును( Sampoornesh Babu) ఇంటర్వ్యూ చేస్తున్న సమయంలో సినిమా నేపథ్యం లేకపోయినా హీరో కావాలనే దురద ఎందుకు? నీలో ఏం చూసి హీరో అవుదాం అనుకున్నావు.. అసలు ది ప్యారడైజ్ లాంటి పెద్ద సినిమాలో నీకు ఎవరు అవకాశం ఇచ్చారు? అంటూ చాలా తక్కువ చేసి సంపూర్ణేష్ బాబును ప్రశ్నించారు . ఇలా ఎన్నో కఠినమైన ప్రశ్నలు వేసినప్పటికీ సంపూర్ణేష్ బాబు మాత్రం అసహనం వ్యక్తం చేయకుండా చాలా ప్రశాంతంగా చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలామంది విలేకర్ ప్రశ్న పైన ఫైర్ అవుతూ పలువురు నెటిజన్స్ సైతం పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Tollywood:జైలు గోడపై టాప్ హీరో స్కెచ్..తెలుగు హీరో సినిమాపై ఫ్యాన్స్ ఫైర్!

అభిమానుల దెబ్బకు క్షమాపణలు చెప్పిన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్..

ఈ విషయం పైన జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ ఒక ప్రత్యేకమైన వీడియోతో సందేశాన్ని విడుదల చేశారు.” సంపూర్ణేష్ బాబుతో తనకు ఎన్నో ఏళ్ల సన్నిహిత్యం, స్నేహం ఉండడం వల్లే ఆ ఇంటర్వ్యూలో చాలా గంభీరంగా ప్రశ్నలు అడిగాను. సరదాగా మాటలు మాట్లాడాను. అంతేకానీ ఆయనని అవమానించాలనే ఉద్దేశం లేదంటూ వివరణ ఇచ్చారు. సంపూర్ణేష్ బాబు పడిన కష్టాలు, ఆయనలోని మానవత దృక్పథం తనకి చాలా ఇష్టమంటూ తెలియజేశారు సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్. తను నాలుగు దశాబ్దాలుగా సినీ జర్నలిజంలో ఉన్నాను ఎవరిని కించపరిచాలనే ఉద్దేశం తనకి ఎప్పుడూ లేదని, ఈ ఇంటర్వ్యూ వల్ల ఎవరైనా బాధపడినా.. సంపూర్ణేష్ బాబు అభిమానులు బాధపడినా క్షమాపణలు చెబుతున్నానని తెలిపారు.

- Advertisement -
Advertisement

also read:iBomma Ravi: ఐ బొమ్మ రవి బ్యాంక్ ఖాతాలపై కోర్టు కీలక నిర్ణయం..!

వివరణ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు..

జర్నలిస్ట్ క్షమాపణ చెప్పిన విషయం పైన సంపూర్ణేష్ బాబు ఒక వీడియోని విడుదల చేస్తూ.. నేను ఇంతకుముందే ఈ వీడియో చూశాను. సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ అన్న నన్ను చేసిన ఇంటర్వ్యూ బాగా వైరల్ గా మారింది. నాకు నాగేంద్ర అన్న చాలా క్లోజ్ .. ఏదో ఫ్లోలో ఒక మాట మాట్లాడాడు అని నేను కూడా అనుకోను.. ఎందుకంటే మా ఇద్దరి మధ్య సన్నిహిత్యం అలాంటిది. చాలా మంది స్టార్ రిపోర్టర్లు నేను అంటే చాలా ఇష్టపడతారు. తన సొంత తమ్ముడిలా చూసుకుంటారు. హృదయ కాలేయం సినిమా నుంచి సపోర్ట్ చేస్తున్న జర్నలిస్టులు అందరితో పాటు నాగేంద్ర అన్న కూడా ఉన్నారు. నన్ను ఇష్టపడే వాళ్లందరూ తప్పుగా తీసుకోవద్దు అంటూ సంపూర్ణేష్ బాబు ఒక వీడియో ద్వారా తెలిపారు. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్టుగా కనిపిస్తోంది.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you