Tollywood:తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ప్రదీప్ అద్వైతం కుటుంబంలో తాజాగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన భార్య ప్రముఖ వ్యాపారవేత్త దీప్తి రెడ్డి హఠాత్తుగా కన్నుమూశారు. గడిచిన కొద్దిరోజులుగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ ఆమె శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన పలువురు సినీ సెలబ్రిటీలు, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. సినీ పరిశ్రమలో ప్రదీప్ రెడ్డి ప్రస్థానం చాలామందికి స్ఫూర్తిదాయనీకమైంది.
డైరెక్టర్ భార్య కన్నుమూత..
ఆరంభంలో అద్వైతం అనే షార్ట్ ఫిలిమ్స్ వల్ల జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా పేరు సంపాదించింది. ఈ గుర్తింపుతో ఆయన సినీ కెరియర్ మొదలవగా, వెండితెర పైన బిల్లా రంగా, మైనే ప్యార్ కియా వంటి చిత్రాలకు దర్శకుడుగా(Tollywood) పనిచేశారు. ఇటీవల వైజయంతి మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థతో రోషన్ మేక హీరోగా నటించిన ఛాంపియన్ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాతో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. భర్త సినీ రంగంలో పేరు సంపాదిస్తూ ఉంటే.. భార్య దీప్తి రెడ్డి మాత్రం వ్యాపార రంగంలో సత్తా చాటుతూ విజయవంతమైన మహిళగా పేరు సంపాదించింది.
also read:Srikanth odela:డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నానికి గొడవలు..?
బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మృతి..
కేవలం వ్యాపారానికి పరిమితం కాకుండా మహిళా సాధికారత కోసం కూడా నిరంతరం చాలా కృషి చేస్తూ యువతులకు ప్రోత్సాహం అందిస్తూ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడమే కాకుండా వారికి మార్గదర్శకంగా కూడా భరోసా ఇచ్చేది. మరొకవైపు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు అంటే డైరెక్టర్ అద్వైతం భార్యకి చాలా ఇష్టం. ముఖ్యంగా తెలంగాణ పండుగ అయిన బ్రతుకమ్మ పండుగను కుటుంబ సభ్యులు ఆత్మీయులతో కలిసి ప్రతిఏటా చాలా ఘనంగా జరుపుకునే వారు. గడిచిన ఐదు రోజుల క్రితం దీప్తి రెడ్డి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యారు.
also read:Bigg Boss:బిగ్ బాస్ హౌస్ నుంచి మూడో వారం బయటికి వచ్చేది ఎవరు..?
మహాప్రస్థానంలో అంత్యక్రియలు..
దీంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్య బృందం అత్యవసర చికిత్స అందించిన ప్రాణాలు కాపాడేందుకు శతవిధాల ప్రయత్నించినా..ఫలితం దక్కలేదు. దీంతో శనివారం సాయంత్రం ఆమె తుది శ్వాస విడిచినట్లుగా వైద్యులు ధ్రువీకరించినట్లు తెలుస్తోంది. దీంతో దీప్తి రెడ్డి అకాల మరణం డైరెక్టర్ అద్వైతం తో పాటుగా ఆయన ఇద్దరు పిల్లలు కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ మరణ వార్త విన్న వెంటనే పలువురు సినీ ప్రముఖులు, దర్శకులు ప్రదీప్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే దీప్తి రెడ్డి మరణ వార్త మహిళా లోకానికి తీరని లోటు అని పలువురు పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు హైదరాబాదులో మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




