Bigg Boss:తెలుగు బిగ్ బాస్ 10 వ సీజన్ చాలా గ్రాండ్ గా మొదలయ్యింది. ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకొని మూడో వారంలోకి విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఇప్పుడు మూడవ వారం మరింత ఆసక్తిగా కొనసాగుతోంది. హౌస్ లో రోజురోజుకి కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, వాగ్వాదాలు, టాస్కులు వంటివి మరింత ఉత్కంఠ పెంచేస్తున్నాయి. ఇప్పటికే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. ఈ సమయంలోనే ఇప్పుడు మూడో వారం ఎలిమినేషన్ కి సంబంధించి చర్చ కూడా చాలా జోరుగా కొనసాగుతోంది.
డేంజర్ జోన్ దిశగా టెంపర్ వంశీ..
తాజాగా వినిపిస్తున్న ప్రకారం మూడో వారం టెంపర్ వంశీ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈవారం ఎలిమినేషన్ ముక్కున ఎదుర్కొంటున్న కంటెస్టెంట్లలో వంశీతోపాటు ఝాన్సీ పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు పైన వినిపిస్తున్న ప్రకారం నటుడు వంశీకే ఈసారి ఎలిమినేషన్ ముప్పు ఎక్కువగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే అసలు ఓటింగ్ ఫలితాలు ఎలా ఉంటాయనే విషయం ఇంకా బిగ్ బాస్ నుండీ అధికారికంగా వెలుబడలేదు. కాబట్టి ప్రస్తుతానికి వంశీ మాత్రం ఎలిమినేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రచారం అయితే జరుగుతోంది.
also read:Srikanth odela:డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో నానికి గొడవలు..?
వంశీ మూడో వారం ఎలిమినేట్ కానున్నారా.?
బిగ్బాస్ (Bigg Boss)హౌస్ లోకి అడుగు పెట్టినప్పటి నుంచి టెంపర్ వంశి తన మాట ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఎపిసోడ్లో ఆయన దూకుడు మరింత పెరిగిందని కూడా చెప్పవచ్చు. టాస్కుల సమయంలో తన అభిప్రాయాలను చాలా గట్టిగా చెప్పడం ఇతర కంటెస్టెంట్లతో వాదనలు దిగడం వంటి అంశాలు కూడా హౌస్ లో మరింత చర్చకు కారణం అవుతున్నాయి. ఒకవైపు ఇదే దూకుడుతో వంశీ పేరు వినిపిస్తున్నప్పటికీ మరొకవైపు కొంతమంది ప్రేక్షకులలో ఆయన పైన ప్రతికూల అభిప్రాయం కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.
also read:Film industry: పెళ్లయిన హీరోతో ఎఫైర్.. కెరియర్ నాశనం చేసుకున్న హీరోయిన్.
ఝాన్సీ పేరు కూడా..
ఇటీవల హౌస్ లో తొలి కెప్టెన్ గా ఎన్నికైన ఝాన్సీ మూడోవారం ఎలిమినేషన్ లిస్టులో ఉండడంతో ఇది ఊహించని పరిణామం అని చెప్పవచ్చు. కెప్టెన్సీ టాస్కులో విజయం సాధించి హౌస్లో రైతుబిడ్డగా తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. ఇదే సమయంలో ఎలిమినేషన్ ముప్పు ఉందని ప్రచారం కూడా వినిపిస్తోంది. అయితే ఓటింగ్ ట్రెండ్స్ లో మాత్రం చివరి వరకు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శని, ఆదివారాల ఎపిసోడ్ల ముందు ప్రేక్షకులు ఓటింగ్లలో మార్పులు కూడా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో వినిపిస్తున్న న్యూస్ ని తుది ఫలితాలుగా ప్రస్తుతం భావించలేము. మరి మూడవ వారం నిజంగానే టెంపర్ వంశి హౌస్ నుంచి బయటికి వస్తారా లేదా ఊహించని ఎలిమినేషన్ ఎవరైనా అవుతారా అనే విషయం చూడాలి మరి.




