TV:వీక్ డేస్‌లోనూ సినీ ప్రియులను అలరించేందుకు తెలుగు టీవీ(TV) ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలతో సిద్ధమయ్యాయి. పాత తరం హీరోల చిత్రాలతో పాటు యాక్షన్, కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీస్ కూడా వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మంగళవారం ప్రేక్షకుల కోసం ఏ ఛానల్లో ఏ సినిమా, ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.
డీడీ యాదగిరి :
డీడీ యాదగిరిలో ఉదయం 9 గంటలకు హాలీవుడ్ యాక్షన్ మూవీ ‘ది రైడ్ 2’ తెలుగు డబ్ వెర్షన్ ప్రసారం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు శోభన్ బాబు నటించిన ‘రఘురాముడు’ను చూడొచ్చు. రాత్రి ప్రసారానికి సంబంధించిన వివరాలు షెడ్యూల్లో వెల్లడించలేదు.
ఈ టీవీ ఛానళ్లు :
ఈటీవీ ప్లస్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ‘పిన్ని’ సినిమా టెలికాస్ట్ కానుంది. ఈటీవీలో ఉదయం 9 గంటలకు, రాత్రి 10.30 గంటలకు ‘భైరవ ద్వీపం’ ప్రసారం కానుంది.
ఈటీవీ సినిమాస్‌లో ఉదయం 7 గంటలకు ‘ముద్దాయి’, 10 గంటలకు ‘బృందావనం’, మధ్యాహ్నం 1 గంటకు ‘లారీ డ్రైవర్’, సాయంత్రం 4 గంటలకు ‘మనిషికో చరిత్ర’ సినిమాలు ఉన్నాయి. రాత్రి 7 గంటలకు ‘ఆయనకి ఇద్దరు’, రాత్రి 10 గంటలకు ‘సుందరం మాష్టార్’ ప్రసారం కానున్నాయి. మిడ్నైట్ 1 గంటకు మరోసారి ‘ముద్దాయి’ను టెలికాస్ట్ చేయనున్నారు.
ALSO READ:Mahesh Babu:రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .320 కోట్లకు వారణాసి మూవీ!
జెమిని ఛానళ్లలో :
జెమిని లైఫ్‌లో ఉదయం 11 గంటలకు ‘అమ్మదొంగ’, సాయంత్రం 4.30 గంటలకు ‘నాగ ప్రతిష్ట’ ప్రసారం కానున్నాయి. జెమిని టీవీలో ఉదయం 9 గంటలకు ‘ఇడియట్’, మధ్యాహ్నం 3 గంటలకు ‘ఔనన్నా కాదన్నా’ సినిమాలు ఉన్నాయి.
జెమిని మూవీస్‌లో తెల్లవారుజామున 1.30 గంటలకు ‘రాజా రమేష్’, 4.30 గంటలకు ‘మానవుడు దానవుడు’, ఉదయం 7 గంటలకు ‘కోరుకున్న ప్రియుడు’, 10 గంటలకు ‘లియో’ ప్రసారం కానున్నాయి. మధ్యాహ్నం 1 గంటకు ‘కాటమరాయుడు’, సాయంత్రం 4 గంటలకు ‘పరశురాం’, రాత్రి 7 గంటలకు ‘అవతారం’, రాత్రి 10 గంటలకు ‘కృష్ణం వందే జగద్గురుం’ టెలికాస్ట్ అవుతాయి.
ALSO READ:Youtuber: ఎయిర్పోర్ట్ లో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్!
జీ తెలుగు, జీ సినిమాలు :
జీ తెలుగులో ఉదయం 9 గంటలకు ‘సాహో’ ప్రసారం కానుంది. జీ సినిమాల్లో ఉదయం 7 గంటలకు ‘భాయ్’, 9 గంటలకు ‘ముత్తు’, మధ్యాహ్నం 12 గంటలకు ‘శంభాల’, 3 గంటలకు ‘గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో’, సాయంత్రం 6 గంటలకు ‘మఫ్టీ పోలీస్’, రాత్రి 9 గంటలకు ‘ఆఫీసర్’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
స్టార్ మా మూవీస్‌లో స్పెషల్ లైనప్ :
స్టార్ మా మూవీస్‌లో ఉదయం 3 గంటలకు ‘ధైర్యం’, 7 గంటలకు ‘పోకిరి’, 9 గంటలకు ‘కృష్ణార్జున యుద్ధం’, మధ్యాహ్నం 12 గంటలకు ‘ఫిదా’ ప్రసారం కానున్నాయి. సాయంత్రం 3 గంటలకు ‘లవ్‌టుడే’, 6 గంటలకు ‘నువ్వే నువ్వే’, రాత్రి 9.30 గంటలకు ‘K.G.F: Chapter 1’ టెలికాస్ట్ అవుతుంది.
స్టార్ మా గోల్డ్ :
స్టార్ మా గోల్డ్‌లో తెల్లవారుజామున ‘అమ్మ చెప్పింది’, ‘లవ్ జర్నీ’, ‘కనుపాప’ చిత్రాలతో పాటు ఉదయం 11 గంటలకు ‘మ్యాస్ట్రో’, మధ్యాహ్నం 2.30 గంటలకు ‘వీడింతే’, సాయంత్రం 5 గంటలకు ‘శ్వాస’, రాత్రి 8 గంటలకు ‘రంగం’ ప్రసారం కానున్నాయి. రాత్రి 11 గంటలకు ‘కనుపాప’ మరోసారి టెలికాస్ట్ అవుతుంది.




