Tuesday, July 7, 2026
HomeLATESTVenkatesh:వెంకటేష్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్..మొదటి మూవీతోనే జాక్ పాట్ ఛాన్స్..!?

Venkatesh:వెంకటేష్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్..మొదటి మూవీతోనే జాక్ పాట్ ఛాన్స్..!?

Venkatesh:వెంకటేష్ తనయుడు అర్జున్ దగ్గుబాటి సినీ రంగ ప్రవేశం అధికారికంగా ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్జున్ తొలి సినిమా, దర్శకుడు, నిర్మాణ సంస్థకు సంబంధించిన తాజా వివరాలు తెలుసుకోండి.

on
- Advertisement -banner Ad

Venkatesh:సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం. తాత పేరు చెప్పుకొని మనవళ్లు, తండ్రి పేరు చెప్పుకొని కొడుకులు, అమ్మ పేరు చెప్పుకొని కూతుర్లు ఎంతోమంది ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యమేలుస్తున్నారు. ఇప్పటికీ స్టార్స్‌గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలోకి ఎంతమంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చినా, జనాలు అందరూ ఎక్కువగా వెయిట్ చేసేది మాత్రం ఇద్దరు స్టార్ హీరోల కొడుకుల గురించే. వాళ్లు మరెవరో కాదు వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు. వెంకటేష్ కొడుకు “అర్జున్” (arjun daggubat)సినిమాలోకి ఎప్పుడొస్తారా..? అంటూ వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు జనాలు. అలాగే సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు కొడుకు “గౌతమ్” ఎప్పుడెప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడతాడా ..? అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.

వెంకటేష్ కొడుకు అర్జున్ ఎంట్రీపై ట్రెండింగ్ వార్త:

అయితే త్వరలోనే వెంకటేష్ కొడుకు అర్జున్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అన్న వార్త ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం “ఆదర్శ కుటుంబం”. ఈ సినిమాపై ఎంత బజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా వేరే లెవెల్‌లో హిట్ అవుతుంది అంటూ జనాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ కుటుంబంపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది.

- Advertisement -

స్పెషల్ అపీరియన్స్‌లో అర్జున్?

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో వెంకటేష్ క్యారెక్టర్ డోస్ ఎక్కువగా ఉంటుంది అని సమాచారం. అంతేకాదు, ఈ సినిమాలో ఒక స్పెషల్ అపీరియన్స్‌గా వెంకటేష్ కొడుకు అర్జున్ ఎంట్రీ ఇవ్వబోతున్నారట. వెంకటేష్ కుమారుడు అర్జున్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

also read:Kalki 2898AD: కల్కి సినిమాలో చూపించిన ఆలయానికి మోక్షం!

- Advertisement -

చివరి 20 నిమిషాల్లో కీలక పాత్ర:

సినిమా చివరి 20 నిమిషాల్లో అర్జున్ ఎంట్రీ ఉంటుందని, కథలో కీలకమైన సమయంలో అతడి పాత్ర కనిపిస్తుందని, త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అద్భుతమైన క్యారెక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేస్తున్నాడని టాక్. వెంకటేష్ కూడా అర్జున్ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వేరే సినిమాలో ఎంట్రీ ఇచ్చే బదులు తండ్రి సినిమాతో ఎంట్రీ ఇస్తే ఆ స్పెషల్ మూమెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఫ్యామిలీ అంతా కలిసి నిర్ణయం తీసుకున్నారట.

also read:Aishwarya Rajesh: పొట్టి గౌనులో విదేశీ వీధుల్లో సందడి చేస్తున్న తెలుగమ్మాయి!

- Advertisement -

అధికారిక ప్రకటన కోసం వెయిటింగ్:

డ్యూరేషన్ తక్కువే అయినా అతడి క్యారెక్టర్ మాత్రం చాలా హైలెట్ అవుతుందట. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా వెంకటేష్ కొడుకు అర్జున్ పాత్ర గురించి మాట్లాడుకునేలా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు క్యారెక్టర్ డిజైన్ చేశాడని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి, అర్జున్ హీరోగా ఏ విధంగా జనాలను మెప్పించబోతున్నాడు అనేది. ఈ విషయంపై ఫుల్ క్లారిటీ రావాలంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. అంతవరకు వెయిట్ చేయాలి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you