Wednesday, July 22, 2026
HomeLATESTKalki 2898AD: కల్కి సినిమాలో చూపించిన ఆలయానికి మోక్షం!

Kalki 2898AD: కల్కి సినిమాలో చూపించిన ఆలయానికి మోక్షం!

Kalki 2898AD: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898AD సినిమాలో పరుశురాముడు పూజించిన దేవాలయానికి ఎట్టకేలకు మోక్షం లభించింది.

on
- Advertisement -banner Ad

Kalki 2898AD: కొన్ని చిత్రాలలో కొన్ని సీన్స్ చూపించడం వల్ల వాటి రూపురేఖలే మారుతూ ఉంటాయి. అలా పెన్నా నది ఒడ్డున వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఒక ఆలయం ఉన్నది.ఈ ఆలయాన్ని పరుశురాముడు ప్రతిష్టించారని అక్కడ స్థానికులు సైతం తెలియజేస్తుంటారు. కరోనా సమయంలో అక్కడ ఉండే కొంతమంది గ్రామ యువకులు.. ఇసుక తిన్నెలలో కూరుకుపోయిన ఆ ఆలయాన్ని గుర్తించి ఇసుకను తవ్వి మరీ వెలుగులోకి తీసుకువచ్చి అందుకు సంబంధించిన వీడియోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా.. అవి వైరల్ గా మారాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ వీడియో సంచలనంగా మారింది. దీంతో చాలామంది ఆ ప్రాంతానికి వచ్చి ఇసుక తిన్నెలలో నుంచి బయటకు వచ్చిన ఆలయాన్ని చూసి మరింత వైరల్ చేశారు.

కల్కి సినిమాలో చూపించిన ఆలయానికి మోక్షం..

అయితే ఇటువంటి సందర్భంలోనే ప్రభాస్(prabhas) నటించిన కల్కి(Kalki 2898AD) సినిమాని కూడా ఇక్కడ చిత్రీకరించడంతో ఈ ఆలయం ప్రాముఖ్యత మరింత పెరిగిపోయింది. ఈ ఆలయం ఏపీ(ap) నెల్లూరు జిల్లాలో పెరుమూల గ్రామంలో పెన్నా నది తీరాన కలదు. ఈ గుడిలో నాగేశ్వర స్వామి ఉండేవారని పరుశురాముడు ఈ గుడిలో కూడా పూజలు చేసే వారని అక్కడ స్థానికులు సైతం కథలు కథలుగా చెబుతూ ఉంటారు. ఆ తర్వాత కాలక్రమంలో అక్కడ ఉండే గ్రామస్తులు కూడా పూజలు చేసేవారని, అనంతరం కొన్ని వందల ఏళ్ల క్రితం ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆ గ్రామంతో పాటుగా దేవాలయం కూడా ఇసుకలో పూడిపోయిందని స్థానికులు సైతం తెలియజేస్తున్నారు.

- Advertisement -
Advertisement

also read:Aishwarya Rajesh: పొట్టి గౌనులో విదేశీ వీధుల్లో సందడి చేస్తున్న తెలుగమ్మాయి!

గ్రామస్తుల చొరవతో రంగంలోకి అధికారులు..

ఇక అప్పటినుంచి ఆలయం ఇసుకలో కప్పబడిపోయిందని, అనంతరం గ్రామస్తులు ఆ గుడికి మూడు కిలోమీటర్ల దూరంగా కొత్తగా ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారని, కరోనా లాక్డౌన్ సమయంలో వెలుగులోకి వచ్చిన ఈ దేవాలయం అప్పటి పురావస్తు శాఖ అధికారులు ఆ దేవాలయాన్ని బయటికి తీసినప్పటికీ అనంతరం మళ్లీ వచ్చిన వరదల కారణంగా ఇసుక తిన్నెలతో కప్పబడిపోయింది. దీంతో గ్రామ ప్రజలు సైతం ఇటీవలే అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి దేవదాయ శాఖ మంత్రి అవ్వడం చేత ఆయన దృష్టికి ఈ దేవాలయం విషయాన్ని తీసుకెళ్లారు.. అనంతరం దేవాలయానికి సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తామని..అక్కడ గ్రామ ప్రజలకు మంత్రి హామీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:Alia Bhatt: బ్యూటీనే కాదు పెర్ఫార్మర్ కూడా.. అదరగొట్టేసిన స్టార్ కిడ్!

భారీ నిధులతో పునర్నిర్మాణం..

ఎట్టకేలకు ఆ హామీ మేరకు దేవాదాయ శాఖ నుంచి 1.50 కోట్ల సిజిఎఫ్ నిధులతో పునర్నిర్మించనున్నారు. అలాగే ఈ దేవాలయం కోసం రోడ్డుకి ఆనుకొని సుమారుగా 5 ఎకరాల ప్రాంగణంలో సనాతన సాంప్రదాయాలు, నిబంధనలు అనుసరిస్తూ ఆలయ నిర్మాణానికి రూపకల్పన చేయడం జరిగింది. అక్కడికి విద్యుత్, త్రాగునీరు, పారిశుద్ధ్య వసతులు ,ఉద్యానవనం వంటి సౌకర్యాలతో పాటుగా భక్తులకు విశ్రాంతి కలిగించే సౌకర్యాలు కూడా తీసుకువచ్చేలా ప్రణాళికలను రూపొందించారు. ఈ ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని ఎన్నో సంవత్సరాలుగా అక్కడి గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నప్పటికీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేకమైన చొరవతో ఈ ఆలయం ఇప్పుడు పునర్నిర్మాణం అవుతోంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you