Wednesday, July 22, 2026
HomeLATESTToxic: లేడీస్ & లేడీస్ అంటూ టాక్సిక్ నుంచి పవర్ ఫుల్ వీడియో!

Toxic: లేడీస్ & లేడీస్ అంటూ టాక్సిక్ నుంచి పవర్ ఫుల్ వీడియో!

Toxic: టాక్సిక్ నుండీ మేకర్స్ లేడీస్ అండ్ లేడీస్ పేరుతో ఒక పవర్ఫుల్ ప్రమోషన్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళల పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేశారు.

on
- Advertisement -banner Ad

Toxic: కన్నడ హీరో యశ్(Yash) , డైరెక్టర్ గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం టాక్సిక్. ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.. అయితే విడుదల తేదీ సమయంలో మాత్రం పోస్ట్ పోన్ అవుతోంది. తాజాగా మేకర్స్ లేడీస్ అండ్ లేడీస్ పేరుతో ఒక పవర్ఫుల్ ప్రమోషన్ వీడియోని విడుదల చేశారు. ఈ వీడియో టాక్సిక్ ప్రపంచాన్ని శాసించే మహిళల పాత్రలను పరిచయం చేస్తూ సినిమాలో వారి ప్రాధాన్యత ఏంటి అనేది చూపించినట్టుగా కనిపిస్తోంది.

టాక్సిక్ నుండీ మరో వీడియో..

నయనతార(Nayanthara), కియారా అద్వానీ(Kiara Advani), రుక్మిణి వసంత్, తారాసుతారియా, హుమా ఖురేషి ఎవరికి వారు తమ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెంట్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. ఇందులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా కీలకంగా ఉండనున్నట్లు వీడియోలో చూపించారు. వీడియో ప్రారంభంలోనే పిల్లలు దూరంగా ఉండండి.. తల్లిదండ్రులు మీ పిల్లలను కూడా దూరంగా ఉంచండి.. బామ్మలు, తాతలు మీ పిల్లలను దూరంగా ఉంచండి. ముత్తాతలు.. మీ సొంత రిస్కుపై చూడండి అంటూ ఒక డిస్క్లైమర్ తో వీడియోని విడుదల చేశారు.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT:ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో అంటే?

గూస్ బంప్స్ తెప్పిస్తూ..

ఇందులో చూపించిన స్టైలిష్ విజువల్స్, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్, హీరో యష్ కనిపించిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. యాక్షన్ తోపాటు ఈ సినిమాలో నటించిన మహిళల పాత్రలకు కూడా చాలా బలమైన సీన్స్ ఉన్నట్లుగా కనిపిస్తోంది. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి నిర్మాతగా యష్ వ్యవహరిస్తున్నారు. గత కొన్ని నెలలుగా పోస్ట్ పోన్ అవుతున్న ఈ సినిమా 2026 ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకించి మరీ భాషలలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

ALSO READ:OTT Movies: ఓటీటీలో భయపెడుతున్న తెలుగు హర్రర్ మూవీ?

అదరగొట్టేసిన యశ్..

కేజిఎఫ్, కేజిఎఫ్ 2 సినిమాలతో భారీ విజయాలను అందుకున్న యశ్ దాదాపుగా మూడేళ్ల తర్వాత తన సినిమా టాక్సిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉండడంతో అభిమానులు కూడా ఈ సినిమా కోసం చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గత సినిమాలకు భిన్నంగా ఉంటుందని కనిపిస్తోంది. అలాగే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణ సినిమాలో కూడా రావణాసురుడి పాత్రలో కనిపించబోతున్నారు. రామాయణా చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత కేజిఎఫ్ 3 తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనాప్పటికీ టాక్సిక్ సినిమాతో మరోసారి యశ్ స్టామినా ఏంటో మరో కొద్ది రోజులలో బయటపడనుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you