Wednesday, July 22, 2026
HomeLATESTVaranasi: వారణాసి సినిమాలో మైండ్ బ్లోయింగ్ సీన్ అదే!

Varanasi: వారణాసి సినిమాలో మైండ్ బ్లోయింగ్ సీన్ అదే!

Varanasi: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ప్రియాంక చోప్రా హీరోయిన్ నటిస్తున్న వారణాసి మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వైరల్ అయింది.

on
- Advertisement -banner Ad

Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా సినిమా అంచనాలను పెంచేయడమే కాకుండా ఈ సినిమా విడుదల తేదీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూసేలా చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ కూడా చిత్ర బృందం శరవేగంగా చేస్తోంది. ఇటీవల కొంత గ్యాప్ ఇచ్చిన చిత్ర బృందం తాజాగా తదుపరి సినిమా షూటింగ్ జూలై 7వ తేదీ నుంచి తిరిగి ప్రారంభం కానుంది.

వారణాసిలో హైలెట్ ఏంటంటే?

ఈ షెడ్యూల్లో సినిమాకి హైలైట్ గా ఉండి, ఒక భారీ యుద్దాన్ని చిత్రీకరించే విధంగా రాజమౌళి ప్లాన్ చేసినట్లు టాకు వినిపిస్తోంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ కోసం గత కొన్ని వారాలుగా చిత్ర బృందం చాలా కష్టపడినట్లుగా టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీక్వెన్స్ లో మహేష్ బాబుతో పాటుగా సుమారుగా 3,500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొనబోతున్నారని సమాచారం. అయితే రాజమౌళి తెరకెక్కించిన గత చిత్రాలైన బాహుబలి, RRR వంటి చిత్రాలలోని యాక్షన్ సీన్స్ ను మించి మరి వారణాసిలో చిత్రీకరించేలా ప్లాన్ చేశారు.

- Advertisement -
Advertisement

also read:Toxic: లేడీస్ & లేడీస్ అంటూ టాక్సిక్ నుంచి పవర్ ఫుల్ వీడియో!

3,500 మందితో..

ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు ఎవరూ చూడని రీతిలో ఈ వార్ సీక్వెన్స్ ని రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సీక్వెల్స్ లో మరో హైలెట్ ఏమిటంటే, 3500 మందితో చిత్రీకరించి ఈ సీన్ విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా వెండితెర పైన ఒక రేంజిలో కనిపించబోతుందట ఈ సినిమాలో రామాయణ ఎపిసోడ్ అందరికీ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు షూట్ చేయబోయే సీన్స్ ను వీఎఫ్ఎక్స్ ద్వారా ఏకంగా 50,000 మంది వానర సైన్యాన్ని ప్రేక్షకులకు చూపించే విధంగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

- Advertisement -
Advertisement

also read:OTT:ఐశ్వర్య రాజేష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఏ ఓటీటీలో అంటే?

థియేటర్లు దద్దరిల్లడం ఖాయం..

వారణాసి సినిమాతో రాజమౌళి తన గ్రాండీయర్ మార్కు చూపించడమే కాకుండా , మహేష్ బాబు స్క్రీన్ ప్రజెంట్స్ కు కూడా థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7వ తేదీన విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా ఇతర దేశాలలో కూడా ఈ సినిమాని విడుదల చేసే సమయానికి పెద్దపెద్ద నిర్మాతలు, డైరెక్టర్లతో ఇప్పటినుంచే వారణాసి సినిమా గురించి చర్చలు జరిపి అక్కడ కూడా చర్చించుకునేలా చేస్తున్నారు. మరి వారణాసి సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా లో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you