Jana Nayagan:తమిళ నటుడు, సీఎం విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ చిత్రానికి డైరెక్టర్ హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, మమిత బైజు , బాబీ దేవోల్ కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా సెన్సార్ ఇబ్బందుల వల్ల ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చినప్పటికీ.. జులై 23న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. దీంతో ఈ సినిమా ఓటీటిలో రావడానికి సిద్ధమయ్యింది.
ఓటీటీ లోకి రాబోతున్న జన నాయగన్..
జననాయగన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటి సంస్థలలో ఒకటైన జి 5 ఓటిటి సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 21వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోతో పంచుకున్నారు. జననాయగన్ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నప్పటికీ సెన్సార్ కారణం వల్ల కోర్టు కేసుల వల్ల జూలై 23న తమిళ్, తెలుగు, హిందీ భాషలలో మాత్రమే జననాయకుడు(Jana Nayagan) పేరుతో విడుదల చేశారు. సరిగ్గా నాలుగు వారాలకు ఓటీటి స్ట్రీమింగ్ కానుంది. మరి డిజిటల్ వేదిక పైన ఈ చిత్రానికి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి మరి.
also read:Dhruv Vikram: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన ధ్రువ్ విక్రమ్..!
జన నాయగన్ మూవీ స్టోరీ..
స్టోరీ విషయానికి వస్తే.. దళపతి వెట్టీ కొండన్ (విజయ్) పోలీస్ అధికారి. ఒక నేరం కింద ఆయన మదురై సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తుంటారు. కొత్తగా వచ్చిన జైలు వార్డెన్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) దళపతి మంచితనం చూసి అనారోగ్యంతో ఉన్న తల్లి (రేవతి) ని చివరిసారిగా చూసేందుకు అనుమతిస్తారు. ఆ తర్వాత ఆగస్టు 15న వచ్చే సాధారణ క్షమాభిక్ష ద్వారా జైలు నుంచి బయటికి పంపించేలా సహాయం చేస్తారు. ఆ సమయంలోనే జైలర్ కూతురు విజ్జి (మమిత బైజు) తో దళపతికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో జైలర్ మరణించడంతో విజ్జీకి అన్ని తానే చూసుకుంటారు.
also read:Shrasti Verma:పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ!
విజ్జి తండ్రి కోరిక మేరకు ఆమెను ఆర్మీలో చేర్పించేందుకు ప్రయత్నిస్తుంటారు.. ఫియర్ ఫోబియా ఉండడంతో ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకొని సాధారణ జీవితాన్ని గడపాలని కోరుకుంటుంది. అలాంటి విజ్జిని ఒక గ్యాంగ్ టార్గెట్ చేసి ఆమెను చంపేందుకు ప్లాన్ చేస్తారు. దీని వెనుక గ్యాంగ్ స్టార్ హిమ్లర్ (బాబి డియోల్) ఉన్నారని దళపతి తెలుసుకొంటారు.. అసలు హిమ్లర్ ఎవరు ? విజ్జిని ఎందుకు చంపాలని చూస్తున్నారు? అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే.
Thangamey! Thalapathy #Jananayagan is all set to meet you all on 21st August only on Zee 5🔥
The Hon’ble Chief Minister @actorvijay @TheKVNofficial @KvnProductions #HVinoth @hegdepooja @anirudhofficial @thedeol @_mamithabaiju @Jagadishbliss @LohithNK01 @RamVJ2412 @TSeries… pic.twitter.com/4mwfq7fDcS
— Zee 5 Tamil (@ZEE5Tamil) August 17, 2026




