Tuesday, August 18, 2026
HomeLATESTAnirudh - Kavya:అనిరుధ్ - కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా..?

Anirudh – Kavya:అనిరుధ్ – కావ్య మారన్ పెళ్లి డేట్ ఇదేనా..?

Anirudh - Kavya: అనిరుద్ , కావ్య మారన్ పెళ్లి డేట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పైగా వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకోవడానికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

on
- Advertisement -banner Ad

Anirudh – Kavya:ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన అనిరుధ్ , కావ్య మారన్ వివాహం గురించి గత కొద్దిరోజులుగా ఏవేవో వార్తలు ప్రచారం అయితే జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటికి కొనసాగింపుగా వీరి వివాహ తేదీ కూడా ఫిక్స్ అయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం మరింత ఊపందుకుంది.

అనిరుద్ , కావ్య పెళ్లి డేట్ ఇదేనా?

అనిరుధ్, కావ్య మారన్ (Anirudh – Kavya)వివాహం నవంబర్ 10వ తేదీన జరగబోతున్నట్లు వినిపిస్తున్నాయి. వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నారని తమిళ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇరువురి కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నట్లు వైరల్ గా మారుతున్నాయి. అందుకోసమే వీరిద్దరూ కలిసి గ్రీస్ కి వెళ్లారని, అక్కడ కెమెరాకు చిక్కడంతో వీరిద్దరి బంధం బయటపడింది అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అదే గ్రీసులో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్గా మారుతోంది. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు అటు అనిరుధ్ కానీ కావ్య మారన్ కానీ ఈ విషయంపైన అధికారికంగా ప్రకటించలేదు.

- Advertisement -
Advertisement

also read:Jana Nayagan:విజయ్ చివరి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

రూమర్స్ కి బలం చేకూర్చిన అనిరుద్ మేనమామ మాటలు..

కేవలం వీరిద్దరి మధ్య డేటింగ్ రూమర్స్ మాత్రమే వినిపిస్తున్నా.. ఇప్పుడు నవంబర్ 10వ తేదీన వివాహం చేసుకోబోతున్నారని వినిపిస్తున్న వార్తల పైన ఇరువురు కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించలేదు. మరి ఈ విషయం కేవలం రూమర్సేనా? నిజమా అనే విషయం తెలియాలి అంటే ఎవరో ఒకరు స్పందించే వరకు ఆడాల్సిందే.. ఇటీవల కాలంలో అనిరుధ్ మామ అయినటువంటి వైజి మహేంద్ర ఒక ఇంటర్వ్యూలో తన అల్లుడు వివాహం పైన స్పందించారు. వీరి వెడ్డింగ్ చాలా గ్రాండ్గా జరగబోతుందని కాన్ఫిడెంట్ తోనే తెలియజేశారు. జోడి కూడా అదిరిపోయిందంటూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం హైలైట్ గా మారింది.

- Advertisement -
Advertisement

also read:Dhruv Vikram: బ్రేకప్ పై తొలిసారి స్పందించిన ధ్రువ్ విక్రమ్..!

ఇన్ డైరెక్ట్ గా కావ్య గురించి కామెంట్స్..

అయితే అమ్మాయి ఎవరు అనే విషయం మాత్రం చెప్పలేదు. కానీ ఆ యువతీ సాధారణ యువతి కాదు అని ఒక పెద్ద టీం ని మెయింటైన్ చేసే కెపాసిటీ కలిగి ఉందని తెలిపారు. ఆమె తండ్రి జీన్స్ నుంచి బిజినెస్ మెలకువలు నేర్చుకోందని పరోక్షంగా కావ్య మారం గురించి అనిరుధ్ మామ తెలియజేసినట్లు తెలుస్తోంది. అనిరుధ్, కావ్య మారన్ వివాహం రూమర్ కాదు అని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విధంగా భావిస్తున్నారు. సన్ పిక్చర్ అధినేత కళానిధి మారన్ కూతురి కావ్య మారన్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె సన్రైజర్స్ హైదరాబాద్ ఐపిఎల్ టీం కి సీఈఓ గా వ్యవహరిస్తున్నారు. అనిరుధ్ కూడా సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు సంపాదించారు.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you