Chiranjeevi:సాధారణంగా హీరోయిన్స్ పెద్దపెద్ద స్టార్స్‌తో నటిస్తే తమ రేంజ్, క్రేజ్ వెంటనే మారిపోతుందని అనుకుంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ యాక్టర్స్‌తో నటిస్తే ఒక్క దెబ్బతో జాక్‌పాట్ ఛాన్స్ కొట్టేసినట్లే ఫీల్ అయిపోతూ ఉంటారు. మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోస్తో నటిస్తే లైఫ్ టైం సెటిల్మెంట్ ఆఫర్స్ ఎన్నో వస్తాయి అని అభిప్రాయం చాలా మంది హీరోయిన్స్‌లో ఉంటుంది. అలాంటి ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదులుకోరు. కానీ ఒక స్టార్ బ్యూటీ మాత్రం మెగాస్టార్ చిరంజీవితో నటించే అవకాశాన్ని రిజెక్ట్ చేసింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హీట్ పుట్టిస్తుంది.
చిరంజీవితో నటించే ఛాన్స్ రిజెక్ట్ చేసిందా?
మెగాస్టార్ చిరంజీవితో నటించే ఛాన్స్ వస్తే ఎవరైనా వదులుకుంటారా? నో వే. ఆయనతో నటించాలి అని, కేవలం రెండు నిమిషాలైనా సరే స్క్రీన్ షేర్ చేసుకుంటే జీవితం ధన్యమైపోతుంది అని భావించే నటీనటులు ఎంతోమంది. మరి మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్టెప్పులు వేసే ఛాన్స్ వస్తే ఒక హీరోయిన్ స్ట్రైట్‌గా రిజెక్ట్ చేసిందట. దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హీట్ పుట్టిస్తున్నాయి.
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఫరియా అబ్దుల్లా. అందానికి అందం, నటనకి నటన, టాలెంట్‌కి టాలెంట్, హైట్‌కి హైట్.. అన్నీ కలవాల్సిన బ్యూటీ. రీసెంట్గా ఈమె ‘సిగ్మా’ సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ ఈవెంట్లో పాల్గొన్న చిరంజీవిని స్ట్రైట్‌గా చెప్పాడు.
ALSO READ:Prabhas:ప్రభాస్ రొమాంటిక్ పోస్ట్.. జూలియట్ ఎక్కడ అంటూ షాక్ ఇచ్చిన డార్లింగ్!
ఫరియాను సరదాగా ఆటపట్టించిన చిరంజీవి :
‘విశ్వంభర’ సినిమాలో నాతో స్టెప్పులు వేయడానికి నువ్వు ఎందుకు రిజెక్ట్ చేశావ్? నేను పొట్టిగా ఉన్నాను అని అనుకోకుండా నువ్వు ఓకే చేసి ఉండాలి. నేను షూ హైట్ వేసుకుని నీతో కలిసి స్టెప్పులు వేసి ఉండేవాడిని కదా’ అంటూ సరదాగా ఆటపట్టించాడు.
దీంతో సోషల్ మీడియాలో ఫరియా అబ్దుల్లా చిరంజీవి(Chiranjeevi) సినిమాను రిజెక్ట్ చేసిందని వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.
ALSO READ:Hrithik Roshan:జైలర్ 2లో హృతిక్ రోషన్ ఎంట్రీ.. వీడియో చూస్తే గూస్బంప్స్ పక్కా!
అసలు కారణం ఏంటి? :
చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఫరియా అబ్దుల్లాను అప్రోచ్ అయ్యారు అని, ఆమెకు ఇష్టం లేక రిజెక్ట్ చేసింది అని కొందరు అంటుంటే.. మేబీ డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, లేకపోతే చిరంజీవితో సినిమా వదులుకుంటారా ..? అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
నిజంగానే ‘విశ్వంభర’ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఫరియా అబ్దుల్లాను చిత్రబృందం సంప్రదించిందా? ఆమెను ప్రత్యేకంగా అప్రోచ్ చేసి స్పెషల్ సాంగ్ చేయాలని రిక్వెస్ట్ చేశారా? ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే, ఫరియా ఆ ఆఫర్‌ను ఎందుకు తిరస్కరించిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే దీనిపై ఇప్పటివరకు ఫరియా అబ్దుల్లా నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు.
ఆమె స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇస్తేనే అసలు కారణం ఏంటనేది స్పష్టమవుతుంది. అప్పటివరకు సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలపై చర్చ కొనసాగుతూనే ఉంటుంది. అభిమానులు కూడా ఫరియా ఎందుకు నో చెప్పిందో తెలుసుకోవాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వచ్చే వరకు దీనిని కేవలం ప్రచారంగా మాత్రమే చూడాల్సి ఉంటుంది. నిజమైన కారణం బయటకు రావాలంటే ఫరియా స్పందించాల్సిందే.




