Movies:రేపు అనగా ఆగస్టు 14న సినీ లవర్స్ కి బిగ్ పండగనే చెప్పాలి. పలు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైపోయాయి. రేపు థియేటర్లలో పలు సినిమా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఏ సినిమాపై అభిమానులు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..? ఏ సినిమా( Movies) హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలు ఇప్పుడు మనం ఇక్కడ చదివి తెలుసుకుందాం. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలుకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలు కూడా కొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రేపు పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాటిల్లో అన్నిటికన్నా హై ఎక్స్పెక్టేషన్స్ అందుకున్న మూవీ సూర్య నటించిన “విశ్వనాథ్ అండ్ సన్స్”.
సూర్య సినిమా పై భారీ అంచనాలు:
తమిళ నటుడు సూర్యకు కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ ఉంది. ఆయన హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన “విశ్వనాథ్ అండ్ సన్స్” రేపు విడుదల కానుంది. ఇప్పటికే చిత్ర బృందం విస్తృతంగా ప్రమోషన్స్ నిర్వహించడంతోపాటు సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కూడా పెరిగిపోయింది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో ఈ సినిమా రూపొందినట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ చిత్రం పై మేకర్స్ కూడా భారీ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా 100% హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది.
విశాల్ “మకుటం”కు హైప్ తక్కువే :
మరోవైపు తమిళ హీరో విశాల్ నటించిన “మకుటం” కూడా రేపే థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకలోక పోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడా ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో సినిమా పై విడుదలకు ముందే పెద్దగా హైప్ కనిపించడం లేదు. మరి థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ చిత్రం ఎలాంటి స్పందనను అందుకుంటుందో చూడాలి.
also read:Wamika Gabbi:డీసీ సక్సెస్.. స్టార్ హీరోల చిత్రాలలో వామికా గబ్బి
తెలంగాణ నేపథ్యంలో ‘పళ్ళ బురుసు’
నాగార్జున నిర్మిస్తున్న “పళ్ళ బురుసు” కూడా రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలంగాణ నేపథ్యంలో తండ్రి కొడుకుల అనుబంధం చుట్టూ సాగే కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లు తెలుస్తుంది. కధ, భావోద్వేగాలు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.
also read:Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..!
‘అగధ’, ‘బట్వారా’ కూడా రేపే:
ఒకప్పుడు విజయవంతమైన చిత్రాల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన అగధ కూడా రేపే విడుదల కానుంది. హారర్ అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు భయపెట్టి మెప్పిస్తుందో రేపు చూడాలి. మరోవైపు బాలీవుడ్ నటుడు సన్ని డియోల్ ప్రధాన పాత్రులో నటించిన ‘బట్వారా’ కూడా రేపే థియేటర్లోకి రానుంది. మొత్తంగా రేపు విడుదల కానున్న అన్ని చిత్రాలలోకి టాప్ వన్ పొజిషన్లో “విశ్వనాథ్ అండ్ సన్స్” సినిమా పైన అభిమానులు హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. వీకెండ్ కావడంతో ప్రేక్షకులు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపే అవకాశం కూడా ఉంది. చూడాలి మరి వీటిలో ఏ సినిమా హిట్ అవుతుందో? ఏ సినిమా అభిమానులను నిరాశ పరుస్తుందో?




