Thursday, August 13, 2026
HomeLATESTRitika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..!

Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ మనసు దోచిన ఆ స్టార్ ఇతడే..!

Ritika Nayak:హీరోయిన్ రితికా నాయక్ తన ఫేవరెట్ పర్సన్ గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

on
- Advertisement -banner Ad

Ritika Nayak:రితిక నాయక్.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఈ పేరే వినిపిస్తుంది. చిన్న హీరోయిన్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ లిస్టులో చేరిపోయింది ఈ అందాల ముద్దుగుమ్మ. రీసెంట్గా ఆమె నటించిన “కొరియన్ కనకరాజు” సినిమా ఎంత పెద్ద సూపర్ సూపర్ హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచిన రితిక నాయక్.. 2022లో రిలీజ్ అయిన “అశోక వనంలో అర్జున కళ్యాణం” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అప్పటినుంచి వరుస్స చిత్రాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. “మిరాయి” సినిమాతో రితిక కెరియర్ కి మంచి బ్రేక్ వచ్చింది. ఇక రీసెంట్గా వచ్చిన కొరియన్ కనకరాజు సినిమాతో స్టార్ హీరోయిన్ లిస్ట్ లో చేరిపోయింది.

వరుణ్ తేజ్ తో కొరియన్ కనకరాజు :

ఇటీవల వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొరియన్ కనకరాజు సినిమాలో హీరోయిన్ గా రితిక నాయక్(Ritika Nayak) కనిపించింది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తూ ఉండడంతో ప్రస్తుతం రితిక పేరు హైలెట్గా మారింది. ఈ క్రమంలో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కెరియర్ కి సంబంధించి ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

- Advertisement -
Advertisement

also read:OTT:థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం నంబర్ వన్‌..మస్ట్ వాచ్ ఫిలిం!

రితిక ఫోన్ వాల్ పేపర్ లో BTS ఫోటో :

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ రితికను తన మొబైల్ వాల్ పేపర్ గురించి ప్రశ్నించారు. అందుకు సమాధానంగా మొబైల్ చూపించింది. అందులో ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న దక్షిణ కొరియా మ్యూజిక్ బ్యాండ్ BTS సభ్యుల ఫోటో కనిపించింది. దీంతో యాంకర్ వెంటనే BTS లో తనకు ఇష్టమైన సభ్యుడు ఎవరు అని అడిగారు?

- Advertisement -
Advertisement

also read:Anupama :‘పెళ్లి చేసుకుని ఉంటే విడాకులు తీసుకునేదాన్ని’.. అనుపమ సంచలన వ్యాఖ్యలు..!

సుగాకు పెద్ద అభిమానిని:

ఈ ప్రశ్నకు రితిక ఏ మాత్రం ఆలోచించుకోకుండా “సుగా” అంటూ సమాధానం ఇచ్చింది. సుగా తన ఫేవరెట్ భ్ట్శ్ సభ్యుడు అని చెప్పింది. ఒకవేళ సుగాను నేరుగా కలిసే అవకాశం వస్తే ఏం మాట్లాడుతారు అని యాంకర్ ప్రశ్నించగా..” ఆ టైం వస్తే మాత్రం నేను ఏమీ మాట్లాడను అని.. కేవలం నేను నీకు పెద్ద ఫ్యాన్ అని చెబుతూ ఉంటాను” అని మాత్రమే వెల్లడించింది.

- Advertisement -
Advertisement

భారత్ కి BTS రావాలి అని ఎదురుచూపు:

BTS వరల్డ్ టూర్ గురించి కూడా రితిక స్పందించింది. BTS భారత్ కి రాకపోవడం తనను చాలా బాధపెట్టింది అంటూ తెలిపింది. అయితే భవిష్యత్తులో తప్పకుండా BTS ఇండియాకు వస్తుంది అని ఆశిస్తున్నట్లు చెప్పింది. ప్రస్తుతం భారత్లో BTS కు భారీగా అభిమానాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. BTS పూర్తి పేరు ‘Bangtan Sonyeondan’. ఈ గ్రూప్‌లో RM, Jin, SUGA, j-hope, Jimin, V, Jung Kook అనే ఏడుగురు సభ్యులు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మ్యూజిక్ గ్రూప్‌కు భారత్‌లోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రితికా తన ఫేవరెట్ సభ్యుడిగా సుగాను చెప్పడంతో BTS అభిమానుల్లో ఈ వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

https://www.instagram.com/p/Dbqh2W0ET3b/?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you