Wednesday, June 24, 2026
HomeLATESTPeddi Movie Ott:మరో వారంలో ఓటీటీలోకి పెద్ది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Peddi Movie Ott:మరో వారంలో ఓటీటీలోకి పెద్ది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Peddi Movie Ott: రామ్ చరణ్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్గా వచ్చిన పెద్ది సినిమా ఇప్పుడు ఓటిటి స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది.

on
- Advertisement -banner Ad

Peddi Movie Ott:అటు థియేటర్లలో సందడి చేసిన ఎన్నో చిత్రాలు ఇటు ఓటీటీలో కూడా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరో భారీ బడ్జెట్ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ఓటీటీ ప్లాట్ఫారం నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనున్నట్లు సమాచారం. ఇక ఆ చిత్రం ఏంటి ? ఎప్పుడు ఏ ప్లాట్ఫారం ద్వారా స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

థియేటర్లలో దూసుకుపోతున్న పెద్ది..

ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తొలి పరిచయంలోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని రూ. 100కోట్ల క్లబ్లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సనా(Bucchibabu Sana).. ఏకంగా తన రెండవ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) తో చేసే అవకాశాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అలా రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పెద్ది అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు జూన్ 4వ తేదీన వచ్చారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అంతకుమించి కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది. అందులో భాగంగానే ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రూ.500 కోట్ల క్లబ్ లోకి చేరే దిశగా అడుగులు వేస్తోంది ఈ సినిమా.

- Advertisement -

also read:Chiranjeevi:సమంత – రాజ్ దంపతులకు చిరంజీవి స్పెషల్ విషెస్.. ప్రెగ్నెన్సీ వార్తలు నిజమేనా?

డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధమైన పెద్ది..

ఇక అలాంటి ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. జూలై 2వ తేదీ నుండి ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషలలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు సమాచారం. పైగా త్వరలోనే దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్మెంట్ చేయనుంది. ఏది ఏమైనా ఇన్ని రోజులు థియేటర్లలో సినిమాను చూడలేకపోతున్నామని ఎదురుచూసిన ఓటీటీ అభిమానులకు ఇది అతి పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

- Advertisement -

పెద్ది సినిమా విశేషాలు..

పెద్ది సినిమా విషయానికొస్తే.. రామ్ చరణ్ హీరోగా , బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ (Janhavi Kapoor ) హీరోయిన్గా నటించిన చిత్రం ఇది. సుకుమార్ రైటింగ్స్ , మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాలో అచ్చియమ్మ పాత్రలో జాన్వీ కపూర్ నటించింది. కానీ ఆ సినిమాలో ఆమె సన్నివేశాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా విమర్శించారు. దీంతో సన్నివేశాలను కట్ చేసి మళ్లీ ఐదు నిమిషాల 56 సెకండ్ల నిడివి ఉన్న కొత్త సన్నివేశాలను సినిమాలో జోడించడం జరిగింది. ఇక ఆ సీన్లు చాలా కొత్తగా.. కథకు కొత్త బలాన్ని ఇవ్వడంతో అభిమానులు మళ్లీ పెద్ది సినిమా చూడడానికి ఎగబడుతుండడం గమనార్హం.

also read:Varanasi : ‘వారణాసి’ ఓటీటీ డీల్.. రిలీజ్‌కు ముందే భారీ బిజినెస్ టాక్!

- Advertisement -

మేకర్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యిందా?

ఇది చూసిన కొంతమంది సినీ విశ్లేషకులు మాత్రం.. ఇది ఒక రకమైన మేకర్స్ మాస్టర్ ప్లాన్ అనే కామెంట్లు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇందులో దివ్యేందు శర్మ, జగపతిబాబు ఇలా పలువురు సినీ సెలబ్రిటీలు తమ పాత్రల పరిధికి మించి నటించడం విశేషం. మొత్తానికైతే కలెక్షన్ల పరంగా దూసుకుపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది పెద్ది. మరి ఓటిటిలో ఎలాంటి వ్యూస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you