Saturday, August 8, 2026
HomeLATESTAllu Arjun: AAA ఓపెనింగ్ కు అల్లు ఫ్యాన్స్ నో ఎంట్రీ..?

Allu Arjun: AAA ఓపెనింగ్ కు అల్లు ఫ్యాన్స్ నో ఎంట్రీ..?

Allu Arjun: అల్లు అర్జున్ ఒకవైపు హీరోగా మరొకవైపు వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నారు.ఇక అందులో భాగంగానే AAA మల్టీప్లెక్స్ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయింది.

on
- Advertisement -banner Ad

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తన సినిమాలను తెరకెక్కిస్తూ విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా పుష్ప, పుష్ప 2 చిత్రాలతో దేశవ్యాప్తంగా భారీ పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్..తన తదుపరి చిత్రాల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తూ అదే దిశగానే ముందుకు వెళుతున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు సినీ సెలబ్రిటీలు ఎక్కువగా బిజినెస్ రంగాలలో రాణిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఎక్కువ మంది సినిమా మల్టీప్లెక్స్లను మొదలు పెడుతున్నారు. అలా అల్లు అర్జున్ కూడా ఆంధ్రప్రదేశ్లోని మొదటి AAA మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించి విశాఖపట్నానికి కూడా రాబోతున్నట్లు వినిపిస్తోంది.

ఆగస్టు 9న అల్లు అర్జున్ మరో మల్టీప్లెక్స్ ప్రారంభం..

ఈ కార్యక్రమం ఆగస్టు 9వ తేదీన నిర్వహించబోతున్నట్లు వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు కూడా చాలా పగడ్బందీగా నిర్వాహకులు నిర్వహించారని, అల్లు అర్జున్(Allu Arjun)స్వయంగా ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించబోతుండడంతో అభిమానులకు కూడా చాలా ఆసక్తి పెరిగిపోయింది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నట్లు వినిపిస్తోంది. ఈ ప్రారంభోత్సవానికి కేవలం కొంతమంది అతిధులకు మాత్రమే ఆహ్వానం అందినట్లుగా సమాచారం.

- Advertisement -
Advertisement

అభిమానులకు నో ఎంట్రీ..

అభిమానుల భారీ రద్దీని దృష్టిలో పెట్టుకొని మరి భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. గతంలో హైదరాబాదులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కారణంగా ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అలాంటిది మళ్లీ జరగకుండా ఈసారి నిర్వాహకులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్ కార్యక్రమం పూర్తి అయ్యేవరకు ఆ ప్రాంగణం నుంచి వెళ్లిపోయే వరకు కూడా మాల్ సాధారణ ప్రేక్షకులకు అందుబాటులో ఉంచకూడదని భద్రతమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

also read:Ritika Nayak:రితిక నాయక్‌కు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా..!

- Advertisement -
Advertisement

ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి స్పందన అందుకుంటుందో..

AAA సినిమాస్ ఇప్పటికే తెలంగాణలో సినీ ప్రియుల నుంచీ మంచి గుర్తింపు సంపాదించుకుంది . ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి మల్టీప్లెక్స్ నిర్మించడం గమనార్హం. విశాఖపట్నంలో ప్రారంభ కాబోతున్న ఈ మల్టీప్లెక్స్ చాలా ఆధ్యాత్మిక సౌకర్యాలు, మెరుగైన థియేటర్ అనుభూతిని అందించేలా ఉండబోతున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ రాకతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా అభిమానులు సైతం పలు రకాల నియమాలను పాటించాలని నిర్వాహకులు కూడా సూచిస్తున్నారు.

also read:Chandana Shetty :చందన శెట్టి గుడ్ న్యూస్.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన నటి..!

- Advertisement -
Advertisement

అల్లు అర్జున్ సినిమాలు..

అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీతో కలిసి రాకా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. ఇందులో అల్లు అర్జున్ గత సినిమాలకు భిన్నంగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తోంది. అలాగే డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా మరో సినిమాలో నటించబోతున్నారు.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you