Thursday, August 6, 2026
HomeLATESTPreity Zinta:పదహారేళ్ల తర్వాత.. ప్రీతి జింటాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన బ్రెట్ లీ!

Preity Zinta:పదహారేళ్ల తర్వాత.. ప్రీతి జింటాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన బ్రెట్ లీ!

Bollywood: ప్రముఖ హీరోయిన్ ప్రీతి జింటా తో రిలేషన్ గురించి ప్రముఖ క్రికెటర్ బ్రెట్ లీ స్పందించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.

on
- Advertisement -banner Ad

Preity Zinta:సినీ ఇండస్ట్రీ, క్రికెట్ మధ్య ఏదో ఒక లింక్ ఎప్పుడు వైరల్ గా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఐపీఎల్ స్టార్ట్ అయితే చాలు అటు సినీ తారలు క్రికెటర్ల మధ్య ఫ్రెండ్షిప్ ,డేటింగ్ వంటి రూమర్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. అలాంటి ఒకరు ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ, బాలీవుడ్ హీరోయిన్ ప్రీతిజింటా మధ్య అఫైర్ ఉందంటూ గతంలో పలు రకాల రూమర్స్ వినిపించాయి.. ఈ విషయం పైన సుమారుగా పదహారేళ్ల తర్వాత బ్రెట్ లీ నోరు విప్పారు.

ప్రీతి జింటాతో రిలేషన్ పై క్రికెటర్ రియాక్షన్..

ఐపీఎల్ ప్రారంభం 2008 నుంచి 2011 మధ్య ప్రీతిజింటా, బ్రెట్ లీ డేటింగ్ లో ఉన్నారంటూ పలు రకాల ప్రచారం అయితే జరిగింది. ఆ సమయంలో వీరిద్దరూ కలిసి మ్యాచులలో సందడి చేయడం ముంబైలోని ఒక రెస్టారెంట్లో కలిసి కనిపించడంతో ఈ గాసిప్స్ మరింత ఎక్కువగా వినిపించాయి. కానీ తాజాగా ఇటీవలే ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రెట్ లీ ఆ వార్తలను ఖండించారు. అందులో ఎలాంటి వాస్తవం లేదంటూ కూడా తెలియజేశారు. తాను ఏనాడు బాలీవుడ్ నటితో డేటింగ్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు.

- Advertisement -
Advertisement

also read:RAAKA:అల్లు అర్జున్ “రాకా”లో అమ్మాయిల ఫేవరేట్ హీరో..?

అసలు నిజం ఇదే..

మీకు అసలైన నిజం చెబుతాను . నేను ఏ బాలీవుడ్ నటి తో కూడా ప్రేమలో లేను.. ప్రీతి జింటా(Preity Zinta) నేను కేవలం అప్పట్లో మంచి స్నేహితులు. ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాము.నేను పంజాబ్ కింగ్స్ కి ఆడేటప్పుడు ఆమె మా టీం బాస్.. చాలా తెలివైన మహిళ.. ఆమె అంటే నాకు చాలా గౌరవం.. నా గురించి ఇప్పటికీ అలాంటి రూమర్స్ వచ్చిన నేను పట్టించుకోలేదు. ఎందుకంటే నాకు నిజమేంటో తెలుసు. జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఆ ఊహాగానాలను నా వరకు రానివ్వలేదంటూ తెలియజేశారు బ్రెట్ లీ. వాస్తవానికి ఈ విషయంపై 2010లో కూడా ప్రీతి జింటా ఈ రూమర్స్ ని సోషల్ మీడియా వేదికగా ఖండించింది.

- Advertisement -
Advertisement

also read:Renu Desai:టార్చర్ చేయకండి.. రేణు దేశాయ్ కామెంట్స్!

ప్రీతి జింటా కెరియర్..

ప్రతి ఏట బ్రెట్ లీ తో తన పేరును కలపడం పాత పడిపోయిన వార్తలను పాపులారిటీ కోసం సృష్టించడం, తమ మధ్య ఏమీ లేకపోయినా ఉన్నట్టు సృష్టించడం వంటివి చేసేవారని ఖండించింది. తమ మధ్య కేవలం స్నేహం మాత్రమే ఉందంటూ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చింది ప్రీతిజింటా. ప్రీతి జింటా 1998లో దిల్సే సినిమాతో తన కెరీయర్ని మొదలుపెట్టింది.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన ప్రీతిజింటా తెలుగులో ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు తదితర చిత్రాలలో నటించింది. ఎక్కువగా బాలీవుడ్ లోనే పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోలకు జోడిగా నటించి స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you