Varanasi: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9. ఈరోజు కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చాలా ఎక్సైటింగ్ గానే ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆ రోజే కొత్త సినిమాలకు సంబంధించి అనౌన్స్మెంట్ లేదా ప్రస్తుతం నటిస్తున్న వారణాసి సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వస్తుందని చాలా ఎక్సైటింగ్గా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాజమౌళితో సినిమా చేస్తుండడంతో వారణాసి సినిమా పైన భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్నారు.
వారణాసి మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..
కానీ గత రెండు మూడు రోజుల నుంచి మహేష్ బాబు పుట్టినరోజు అయినా కూడా సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్లు గాని ఏవి ఉండవని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వారణాసి సినిమా నుంచి ఒక అప్డేట్ రాబోతోందని అది కూడా ఒక పోస్టర్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు వినిపిస్తోంది. ఇందులో మహేష్ బాబు షర్టు లేకుండా వారణాసి సినిమా నుంచీ ఒక లుక్ ను విడుదల చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. చాలామంది హీరోలు షర్టు లేకుండా సిక్స్ ప్యాక్ లు చూపిస్తూ మరీ సినిమాలు చేస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం ఇప్పటివరకు షర్ట్ తీసేసి ఏ సినిమాలో కూడా కనిపించలేదు.
ALSO READ:The Paradise:ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్.. మాస్ అవతార్లో నాని రచ్చ!
ఘట్టమనేని ఫ్యాన్స్ కి పూనకాలే..
అయితే ఇటీవలే మహేష్ బాబు షర్టు లేకుండా స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్నట్లుగా నమ్రత ఒక పోస్ట్ ని షేర్ చేయగా క్షణాలలో వైరల్ గా మారింది. ఇక వారణాసి కోసం మహేష్ బాబు షర్ట్ లెస్ గా కనిపించబోతున్నట్లు వినిపిస్తోంది. బర్తడే కి ఇలాంటి ఫోటోని రిలీజ్ చేసి అభిమానులకు ఈ సినిమాపై మరింత హైప్ పెంచేలా రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వారణాసి చిత్ర గ్లింప్స్ ఈవెంట్లో కూడా మహేష్ బాబు మాట్లాడుతూ రాజమౌళి నా షర్టు బటన్స్ తీసేయమన్నాడు నేను షర్టు బటన్స్ ఫుల్లుగా పెట్టుకుంటాను అన్నా వద్దని చెప్పుకొచ్చారని తెలిపారు.
ALSO READ:Tollywood:స్టేజ్ పైనే.. పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
రాజమౌళి ప్లాన్ అదుర్స్..
దీంతో కచ్చితంగా వారణాసి(Varanasi) సినిమాలో రాజమౌళి మహేష్ తో షర్టు లేకుండా ఒక సీన్ చేయించి ఉంటారని అభిమానులు కూడా భావిస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే మహేష్ బాబు పుట్టినరోజు వరకు ఆగాల్సిందే. మరి మహేష్ బాబు షర్ట్ లెస్ పోస్టర్ వస్తుందా? రాదా? అనే విషయం చూడాలి. మరి వారణాసి చిత్రంలో మహేష్ బాబు రుద్ర గా ఒక పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలిసిందే. ఇందులో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉంటుందని, సినిమా ఎవరు ఊహించని రీతిలో ఉంటుందని రాజమౌళి ఎన్నో సందర్భాలలో తెలియజేశారు. వచ్చే ఏడాది ఆగస్టు ఏడవ తేదీన వారణాసి సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.




