Wednesday, July 8, 2026
HomeLATESTBandla Ganesh: ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్!

Bandla Ganesh: ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్!

Bandla Ganesh: ప్రశ్న రావణ్ అరెస్టుపై ప్రకాష్ రాజు తనదైన శైలిలో వీడియోలు విడుదల చేస్తూ జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్లు పెడుతున్న నేపథ్యంలో బండ్ల గణేష్ కౌంటర్ ఇచ్చారు.

on
- Advertisement -banner Ad

Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు ఇప్పుడు సినీ పరిశ్రమకు తాకాయి. ప్రముఖ యూట్యూబర్ గా పేరు సంపాదించిన ప్రశ్న రావణ్ ను అరెస్టు చేయడం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు రకాల ఆరోపణలతో ఏపీ పోలీసులు ప్రశ్న రావన్ పైన వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పైన అనేక కేసులను నమోదు చేస్తూ.. ఒకచోట బెయిల్ రాగానే మరొక కేసులో అరెస్టు చేస్తోన్న వ్యవహారం ఇప్పుడు రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పైన చాలామంది స్పందిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఈ విషయం పైన ఫైర్ అవుతూ ఉన్నారు.

మళ్లీ ప్రశ్న రావణ్ అరెస్ట్..

అయితే ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత , నటుడుగా పేరు సంపాదించిన బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ప్రకాష్ రాజ్(Prakash Raj) పై మండిపడ్డారు.. ప్రశ్న రావణ్ పై కేవలం నాలుగు రోజులలోనే నాలుగుసార్లు కేసులు నమోదు అవ్వగా.. కోర్టు ముందు హాజరు పరిచిన ప్రతిసారి బెయిల్ లభించింది. చివరికి శనివారం రాత్రి కూడా యలమంచి కోర్టు నుంచీ ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. అలా వచ్చిన కొద్దిసేపటికే ఏలూరు పోలీసులు నక్కలపల్లి టోల్ ప్లాజా వద్ద రావణ్ ను ఐదవ సారి అరెస్టు చేయడం జరిగింది. ఇలా వరుసగా అరెస్టు చేయడంపై ప్రశ్న రావణ్ కూడా ప్రశ్నిస్తూ ఆమరణ నిరాహార దీక్ష పట్టారు.

- Advertisement -

also read:NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్?

మండిపడ్డ ప్రకాష్ రాజ్..

ప్రశ్న రావణ్ వరుస అరెస్టుల పైన ప్రకాష్ రాజ్ ఫైర్ అవుతూ ఈ అరెస్టులన్నీ తప్పుపడుతూ సోషల్ మీడియా వేదికగా వీడియోలను విడుదల చేస్తున్నారు. నాలుగు సార్లు బెయిల్ వచ్చిన కూడా వెంటవెంటనే ఐదో సారి కూడా అరెస్ట్ చేయడం న్యాయవ్యవస్థను అవమానించడమే అంటూ విమర్శించారు. కోర్టులో బెయిల్ ఇస్తున్నామంటే పెట్టిన కేసులు నిలబడలేదని అర్థమే కదా.. ప్రశ్నించే గొంతుల పైన ఇంత కక్ష సాధింపు అవసరమా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేస్తూ ఇలాంటి అహంకారం, అసహనం అవసరమా అంటూ ప్రకాష్ రాజ్ ఘాటుగా ట్వీట్ చేశారు.

- Advertisement -

also read:Sanjana Galrani:తెలుగు సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ సంజన!

ప్రకాష్ రాజ్ కి బండ్ల గణేష్ స్ట్రాంగ్ కౌంటర్..

అయితే ఈ విషయం పైన బండ్ల గణేష్(Bandla Ganesh) స్పందిస్తూ.. ప్రకాష్ రాజ్ వైఖరిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రతి విషయంలో అతిగా ప్రవర్తిస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు. నువ్వు ఎందుకిలా ప్రతి విషయాన్ని అతిగా స్పందిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఈ డ్రామా అంతా కూడా ఎవరి మెప్పు కోసం చేస్తున్నావు. ముందు నీ స్థాయి ఏంటో, నీ బాధ్యతలు ఏంటో తెలుసుకో.మీ అద్దంలో ఒకసారి సరిగ్గా చూసుకో.. నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.. నువ్వు చేసే అతి చూస్తూ ఉంటే విసుగు పుడుతోంది. నీ అహంకారం చూస్తే అసహ్యం వేస్తోంది.., కొంచెం అనుకువుగా ఉండడం నేర్చుకో అంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you