Wednesday, July 8, 2026
HomeLATESTOTT :ఈ వారం OTTలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.. స్ట్రీమింగ్‌కు వస్తున్న టాప్ సినిమాలు ఇవే!

OTT :ఈ వారం OTTలో ఎంటర్‌టైన్‌మెంట్ జాతర.. స్ట్రీమింగ్‌కు వస్తున్న టాప్ సినిమాలు ఇవే!

OTTఈ వారం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు రాంచరణ్ 'పెద్ది', రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ మూవీతో పాటు మరెన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియోహాట్‌స్టార్, అమెజాన్

on
- Advertisement -banner Ad

OTT :ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రాబోతుంది. జూలై 8 నుంచి 12 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫాములైన నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వరుసగా విడుదల కాబోతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నటించిన “పెద్ది” డిజిటల్ ప్రీమియర్ కూడా ఈ వారమే కావడంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

పెద్దితో హైలెట్ :

రామ్ చరణ్ , జాన్వి కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామ “పెద్ది” జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా అందుబాటులోకి రానుండగా హిందీ వర్షన్ తర్వాత విడుదల కానుంది. థియేటర్లో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా ఆకట్టుకుంటుందని అంచనాలు ఉన్నాయి.

- Advertisement -

రకుల్ మూవీ తో పాటు మరిన్ని సినిమాలు:

ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామిక గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రొమాంటిక్ కామెడీ “పతి పత్నీ ఔర్ వో దో” కూడా జూలై 10 న స్ట్రీమింగ్ కి రానుంది. అదే రోజు అక్షయ్ కఖన్నా, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు రూమ్ డ్రామా “ఇక్కా” కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్కంఠ భరతమైన కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.

also read:Bandla Ganesh: ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్!

- Advertisement -

సిరీస్ లు, డాక్యుమెంటరీలు కూడా :

హిస్టారికల్ డ్రామా ‘Little House On The Prairie’ జూలై 9 నుంచి అందుబాటులోకి వస్తుంది. 2012లో జరిగిన కోస్టా కాన్‌కోర్డియా నౌక ప్రమాదం ఆధారంగా రూపొందిన ‘Shipwrecked: Nightmare At Sea’ డాక్యుమెంటరీ జూలై 10న విడుదల కానుంది. అదే రోజు జపనీస్ డ్రామా ‘Until The T-Shirt Dries’ కూడా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.

also read:NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్?

- Advertisement -

వారాంతానికి మరిన్ని కొత్త కథలు :

జూలై 11న క్రైమ్ థ్రిల్లర్ ‘The Apartment Job’ ప్రేక్షకులను అలరించనుండగా, జూలై 12న స్పానిష్ కామెడీ డ్రామా ‘Susana And Elvira: No Plan B’ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇలా యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్, డాక్యుమెంటరీలతో ఈ వారం ఓటీటీలో ప్రతి అభిరుచికి తగ్గ కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇంట్లోనే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆస్వాదించాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you