OTT :ఈవారం ఓటీటీ ప్రేక్షకులకు పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి రాబోతుంది. జూలై 8 నుంచి 12 వరకు ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫాములైన నెట్‌ఫ్లిక్స్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు వరుసగా విడుదల కాబోతున్నాయి. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రామ్ చరణ్ నటించిన “పెద్ది” డిజిటల్ ప్రీమియర్ కూడా ఈ వారమే కావడంతో సినీ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
పెద్దితో హైలెట్ :
రామ్ చరణ్ , జాన్వి కపూర్ జంటగా నటించిన స్పోర్ట్స్ డ్రామ “పెద్ది” జూలై 9 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో సినిమా అందుబాటులోకి రానుండగా హిందీ వర్షన్ తర్వాత విడుదల కానుంది. థియేటర్లో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో కూడా ఆకట్టుకుంటుందని అంచనాలు ఉన్నాయి.
రకుల్ మూవీ తో పాటు మరిన్ని సినిమాలు:
ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్, వామిక గబ్బి, రకుల్ ప్రీత్ సింగ్ నటించిన రొమాంటిక్ కామెడీ “పతి పత్నీ ఔర్ వో దో” కూడా జూలై 10 న స్ట్రీమింగ్ కి రానుంది. అదే రోజు అక్షయ్ కఖన్నా, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో రూపొందిన కోర్టు రూమ్ డ్రామా “ఇక్కా” కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉత్కంఠ భరతమైన కథనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది.
also read:Bandla Ganesh: ప్రకాష్ రాజ్ కు బండ్ల గణేష్ కౌంటర్!
సిరీస్ లు, డాక్యుమెంటరీలు కూడా :
హిస్టారికల్ డ్రామా ‘Little House On The Prairie’ జూలై 9 నుంచి అందుబాటులోకి వస్తుంది. 2012లో జరిగిన కోస్టా కాన్‌కోర్డియా నౌక ప్రమాదం ఆధారంగా రూపొందిన ‘Shipwrecked: Nightmare At Sea’ డాక్యుమెంటరీ జూలై 10న విడుదల కానుంది. అదే రోజు జపనీస్ డ్రామా ‘Until The T-Shirt Dries’ కూడా స్ట్రీమింగ్ ప్రారంభమవుతుంది.
also read:NTR:ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్?
వారాంతానికి మరిన్ని కొత్త కథలు :
జూలై 11న క్రైమ్ థ్రిల్లర్ ‘The Apartment Job’ ప్రేక్షకులను అలరించనుండగా, జూలై 12న స్పానిష్ కామెడీ డ్రామా ‘Susana And Elvira: No Plan B’ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇలా యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్, డాక్యుమెంటరీలతో ఈ వారం ఓటీటీలో ప్రతి అభిరుచికి తగ్గ కంటెంట్ సిద్ధంగా ఉంది. ఇంట్లోనే కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఆస్వాదించాలని భావించే వారికి ఇది మంచి అవకాశం.


