Bhanu Chander:సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్స్ ఎలా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. అవసరం ఉంటే తప్ప ఫోన్లు ఎత్తరు. ఆఫర్లు కావాలంటేనే మెసేజ్‌లు పెడుతూ ఉంటారు. అవసరం ఉంటే తప్ప ముఖం కూడా చూడని ఫ్రెండ్షిప్‌లు ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే కనిపిస్తూ ఉంటాయని జనాలు మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమా చేసే వరకు అన్యోన్యంగా ఉండి, జాన్ జిగిడి దోస్తుల్లా మెలుగుతారు. కానీ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం వాళ్లదే తప్పు, వీళ్లదే తప్పు అంటూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉంటారు. స్టేజిపై ఎంతోమంది స్టార్స్ ఇలా నిందించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
భానుచందర్–సుమన్ స్నేహం మాత్రం ప్రత్యేకం:
అయితే వాళ్లందరిలోకి ప్రత్యేకం భానుచందర్(Bhanu Chander), సుమన్(suman). వీళ్లిద్దరి ఫ్రెండ్షిప్ గురించి చాలా తక్కువ మందికే తెలుసు. వీళ్లిద్దరి స్నేహం ఎప్పటినుంచో కొనసాగుతోంది. భానుచందర్, సుమన్‌ల ఫ్రెండ్షిప్ మామూలు స్నేహబంధం కాదు. విడదీయరాని బంధం. ఎంతోమంది వీళ్లను విడదీయాలని చూశారనే వార్త కూడా విన్నాం. అయితే ఒకానొక ఇంటర్వ్యూలో భానుచందర్ తన ప్రాణస్నేహితుడు సుమన్ గురించి ఆకాశానికెత్తుతూ పొగిడేశారు. అంతేకాదు, సుమన్ తనను కాపాడాడని, తనను జైలుకు వెళ్లకుండా రక్షించాడని భానుచందర్ చెప్పడం హైలైట్‌గా మారింది.
సుమన్‌పై ఫేక్ కేసులు.. భానుచందర్‌కు ముందే హెచ్చరిక:
సుమన్‌ను కావాలనే కొందరు ఫేక్ కేసుల్లో, బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించడానికి చాలా ప్రయత్నించారు. ఇది అందరికీ తెలిసిందే. సుమన్‌పై లేనిపోని నిందలు వేసి ఆయన కెరీర్‌ను డ్యామేజ్ చేయాలని చూశారు. అయితే సుమన్‌తో పాటు ఆయన ప్రాణస్నేహితుడు భానుచందర్‌ను కూడా ఆ బ్లూ ఫిల్మ్ కేసులో ఇరికించి, భానుచందర్‌ను జైలుకు పంపించి ఆయన కెరీర్‌ను నాశనం చేయాలని చూశారట. ఈ బ్లూ ఫిల్మ్ ఫేక్ కేసులు పెట్టించింది ఓ స్టార్ డైరెక్టర్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ సుమన్ ఈ విషయాన్ని ముందే తెలుసుకుని భానుచందర్‌ను దూరం పెట్టి, భానుచందర్‌పై ఎటువంటి కేసులు లేకుండా చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా భానుచందరే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
also read:Venkatesh:వెంకటేష్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్..మొదటి మూవీతోనే జాక్ పాట్ ఛాన్స్..!?
భానుచందర్ చెప్పిన సంఘటన:
భానుచందర్ మాట్లాడుతూ.. “ఓ రోజు నేను కారులో రోడ్డుపై వెళ్తూ ఉంటే, సడన్‌గా ఒక కారు నా ముందుకు స్పీడ్‌గా వచ్చి ఆగింది. నేను కోపంతో కార్ డోర్ తీసి, ‘ఎవడ్రా నువ్వు.. బయటికి రా’ అంటూ వచ్చాను. అప్పుడు కారులో నుంచి సుమన్ బయటకు దిగాడు. ‘ఈ స్పీడ్ ఏంటి..? ఏమైపోతావో తెలుసా?’ అంటూ అరిచాను. అప్పుడు వెంటనే వాడు నాతో, ‘నేను కొన్ని ఫేక్ కేసుల్లో ఇరుక్కున్నాను. అందులో నిన్ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు నాకు కొన్ని నెలలు ఫోన్ చేయకు. నాకు దూరంగా ఉండు. మాట్లాడకు.. మెసేజ్ చేయకు’ అని చెప్పాడు. అతను ఎంత గొప్ప స్నేహితుడు కాకపోతే ఇలా మాట్లాడతాడు? ఇంకొకరైతే నా పేరును కూడా మధ్యలోకి లాగి నా కెరీర్‌ను నాశనం చేయాలని చూసేవారు. కానీ సుమన్ అలా చేయలేదు” అని భానుచందర్ ఎంతో భావోద్వేగంతో చెప్పారు.
also read:Kalki 2898AD: కల్కి సినిమాలో చూపించిన ఆలయానికి మోక్షం!
నిజమైన ఫ్రెండ్షిప్‌కు నిదర్శనం:
ఫ్రెండ్షిప్‌కు నిజమైన అర్థం ఇదేనంటూ చాలామంది స్టార్స్ వీళ్ల స్నేహబంధాన్ని పొగుడుతున్నారు. వీళ్ల ఫ్రెండ్షిప్ చూసి నేటి కాలం స్నేహితులు ఎంతో నేర్చుకోవాలని జనాలు కామెంట్స్ చేస్తున్నారు.


