Wednesday, July 8, 2026
HomeLATESTOG 2:పవన్ కళ్యాణ్ ఓజీ 2కు అదే బలంగా మారనుందా?

OG 2:పవన్ కళ్యాణ్ ఓజీ 2కు అదే బలంగా మారనుందా?

OG 2: సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓ జి 2 సినిమాకు సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అంజనాలు పెంచేసింది.

on
- Advertisement -banner Ad

OG 2:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్లో వచ్చిన ఓజీ సినిమా అభిమానులలో ఎంతటి వైబ్ తీసుకువచ్చిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఎలాంటి రాజకీయ కోణంలో డైలాగులు లేకపోవడంతో ఈ సినిమా ఆకట్టుకుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని చూపించిన తీరు కూడా ఆకట్టుకోవడమే కాకుండా ఒక సరి కొత్త స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మీ యాక్టింగ్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, సుదేవ్ నాయర్ తదితర నటీనటులు నటించారు. గత కొంతకాలంగా ఓజి 2 సినిమా రాబోతోందని వార్తలు వినిపించాయి. అందుకు తగ్గట్టుగా అటు డైరెక్టర్, హీరో పవన్ కళ్యాణ్, తమన్ ఒకే చోట కలిసి ఉన్న ఫోటో కూడా ఇటీవల కాలంలో షేర్ చేయడంతో కన్ఫామ్ అయ్యింది.

త్వరలో ఓజీ 2 సినిమా షూటింగ్ ప్రారంభం..

త్వరలోనే ఓజి 2 మొదలు కాబోతున్న నేపథ్యంలో.. డైరెక్టర్ సుజిత్(SUJEETH) ఈసారి కథ పైన ప్రత్యేకించి మరీ దృష్టి పెట్టినట్లుగా ఒక వార్త వినిపిస్తోంది. పూర్తిస్థాయి స్క్రిప్ట్ ని సిద్ధం చేసి పవన్ కళ్యాణ్(pawan Kalyan ) కు వినిపించగా ఆయన కూడా ఓకే అన్నట్టుగా ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో వచ్చిన కథ పరమైన విమర్శలకు సైతం తావు ఇవ్వకుండా.. ఈసారి మరింత జాగ్రత్తలు తీసుకోబోతున్నారని తెలిసి పవన్ అభిమానులు కూడా ఆనంద పడుతున్నారు.

- Advertisement -

ALSO READ:Bhanu Chander:బ్లూ ఫిల్మ్ కేసు వివాదం.. భానుచందర్‌కు అండగా నిలిచిన హీరో ఎవరో తెలుసా?

పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్గా ఎవరు?

ఓజీ సినిమా మొదటి భాగంలో కేవలం సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఎలివేషన్స్ విజువల్స్ అందరి చేత ప్రశంసలు దక్కించేలా చేశాయి. ప్రియాంక మోహన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటించిన ఈ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ పాత్ర ముగిసింది.. మరి ఓజి 2 లో హీరోయిన్గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.. డైరెక్టర్ సుజిత్ మాత్రం ఈసారి బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసే పనిలో పడ్డట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఎవరు హీరోయిన్గా ఎంపిక చేస్తారో తెలియాలి మరి.

- Advertisement -

ALSO READ:Venkatesh:వెంకటేష్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్..మొదటి మూవీతోనే జాక్ పాట్ ఛాన్స్..!?

పవన్ కళ్యాణ్ సీఎం అవుతారా?

పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలోనే కాకుండా పొలిటికల్ పరంగా కూడా బిజీగా ఉన్నారు. అంతేకాకుండా జనసేన పార్టీ కార్యక్రమాలలో కూడా నిరంతరం పాల్గొంటూ నేతలను, కార్యకర్తలను సైతం రాజకీయాలలో చురుకుగా పాల్గొనేలా సూచనలు ఇస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ను సీఎంగా చూడాలని అభిమానులు, కార్యకర్తలు, నేతలు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you