Sreemukhi:ఇప్పుడు ఎక్కడ చూసినా యాంకర్ శ్రీముఖి పేరే బాగా ట్రెండ్ అవుతోంది. ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆమె పేరు మరింత మారుమోగుతోంది. అయితే ఇప్పుడు ఆమె పేరు హాట్ టాపిక్ అవ్వడానికి కారణం సినిమాలు కాదు.. ఆమె వ్యక్తిగత జీవితం.
పెళ్లి చేసుకోబోతుందనే ప్రచారం:
శ్రీముఖి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, అది కూడా తన లవర్‌నే పెళ్లి చేసుకోబోతుందని, గత 13 ఏళ్లుగా ప్రేమాయణం కొనసాగిస్తున్న శ్రీముఖి ఎట్టకేలకు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో చెప్పిన మాట వైరల్:
శ్రీముఖి ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హోస్ట్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, “పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు?” అన్న ప్రశ్నకు, “ఈ సినిమా రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ కొట్టాక చేసుకుంటాను” అని చెప్పింది. దీంతో సినిమా రిలీజ్ అయి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాక అందరి కళ్లూ శ్రీముఖిపై పడ్డాయి. శ్రీముఖి(Sreemukhi) నిజంగానే పెళ్లి చేసుకుంటుందా? లేక మాట తప్పుతుందా? అంటూ రకరకాల కామెంట్లు పెట్టడం కూడా ప్రారంభించారు.
also read:OTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా సామీ..!
13 ఏళ్ల ప్రేమ.. లవర్‌తో పెళ్లి అంటూ ప్రచారం:
ఇదే తరుణంలో శ్రీముఖి తన లవర్‌తో పెళ్లి చేసుకోబోతోందన్న వార్త బాగా ట్రెండ్ అవుతోంది. అది కూడా 13 ఏళ్లుగా ప్రేమలో ఉన్న లవర్‌తోనే అంటూ ఈ వార్తను బాగా డీప్‌గా, లోతుగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారు? యాంకర్ ప్రదీప్. టీవీలో ఎప్పుడూ హుషారుగా, చకచకా, గలగల మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకునే యాంకర్ ప్రదీప్ పేరు ఇందులోకి లాగుతున్నారు. యాంకర్ ప్రదీప్ పెళ్లి ఎప్పుడు అంటూ ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకపక్క యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోలేదు. ఇంకోపక్క శ్రీముఖి కూడా పెళ్లి చేసుకోలేదు. వీళ్లిద్దరూ ఏ షో చేసినా హిట్ అయిపోతుంది.
also read:Tollywood:మాజీ బాయ్ ఫ్రెండ్ సైకో.. టాలీవుడ్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!
ప్రేమలో ఉన్నారంటూ గాసిప్స్:
ఇదే తరుణంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టే గతంలో వాళ్లిద్దరూ కలిసి పెళ్లి శుభలేఖను పంచుతున్నట్లు, వాళ్ల పెళ్లి కుదిరినట్లు ఒక కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిన షోకు సంబంధించిన ఫొటోలను మళ్లీ వైరల్ చేస్తున్నారు. శ్రీముఖి, ప్రదీప్‌ల మధ్య ప్రేమ నిజమే అంటూ ఘాటుగా ప్రచారం చేస్తున్నారు. అయితే దీనిపై అటు శ్రీముఖి కానీ, ఇటు ప్రదీప్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు. అందిన సమాచారం ప్రకారం ఇది పూర్తిగా సృష్టించిన ప్రచారమే.
శ్రీముఖి చెప్పింది ఇదే:
శ్రీముఖికి, ప్రదీప్‌కు మధ్య స్వచ్ఛమైన ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని వాళ్లు గతంలో చాలా సార్లు చెప్పారు. “ప్రదీప్ నాకు చాలా మంచి ఫ్రెండ్” అంటూ శ్రీముఖి ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.వాళ్ళ మధ్య ఉన్న చనువు, అలాగే శ్రీముఖి స్టార్‌డమ్, ‘మా ఇంటి బంగారం’ ప్రమోషన్స్‌లో ఆమె చెప్పిన మాటల ఆధారంగా వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ రకరకాల పుకార్లు పుట్టించారు. దీంతో శ్రీముఖి, ప్రదీప్ పేర్లు సోషల్ మీడియాలో మారుమోగిపోతున్నాయి. దీనిపై వీళ్లిద్దరూ ఎంత త్వరగా స్పందించి ఈ వార్తలకు చెక్ పెడితే, వాళ్ల ఫ్యూచర్‌కు అంతా బాగుంటుందని తెలిసిన వాళ్లు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు.


