Mega 158:చిరంజీవి ఇండస్ట్రీలో ఈ పేరుకి ఒక ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందరిలా సాదాసీదా హీరో కాదు. వయసు పైబడిపోతున్నా సరే, తన వయసును లెక్కచేయకుండా అభిమానులను ఎంటర్‌టైన్ చేయడానికి ఆయన తీసుకున్న రిస్కీ డిసిషన్స్ ఆయనపై అభిమానాన్ని ఇంకా ఎక్కువయ్యేలా చేస్తుంటాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవిపై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. దానికి ఆయన కూతురు కూడా చాలా స్ట్రాంగ్‌గా రిప్లై ఇచ్చింది. “మెగాస్టార్ చిరంజీవి అంటే ఇప్పటి జనాలకు ఎలా తెలుసో కానీ, ఒకప్పటి జనాలకు మాత్రం బాగా తెలుసు” అంటూ ఘాటైన కౌంటర్ ఇచ్చి పడేసింది.
బాబీ దర్శకత్వంలో మెగా 158:
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమైపోయాడు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ‘మెగా 158’ (mega 158)అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌ను పంచుకుంటూ వస్తోంది మూవీ టీమ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.
భారీ యాక్షన్ సన్నివేశాలతో హైప్:
భారీ యాక్షన్ సన్నివేశాల్లో మనం చిరంజీవిని చూడబోతున్నామంటూ ఇటీవల చిత్రబృందం ఒక వీడియోను రిలీజ్ చేస్తూ హైప్ పెంచింది. “కొత్త కోణంలో చూడడానికి రెడీగా ఉండండి” అంటూ ఆసక్తికర అప్‌డేట్ ఇచ్చింది. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సారథ్యంలో భారీ యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నట్లు కొన్ని క్లిప్స్ రిలీజ్ చేశారు. సినిమాకు ఈ సీన్స్ హైలైట్‌గా నిలవనున్నాయని ఆ క్లిప్స్ చూస్తేనే అర్థమవుతోంది.
also read:Sreemukhi:యాంకర్ శ్రీముఖి పెళ్లి బజ్.. లవర్‌తో మ్యారేజ్‌పై ఆసక్తికర అప్డేట్!
రిస్కీ స్టంట్స్‌పై చర్చ:
చిరు ఇందులో రిస్క్‌తో కూడిన స్టంట్స్ చేస్తున్నారు. అయితే వయసు అయిన తర్వాత ఇంత రిస్కీ స్టంట్స్ చేయడం అవసరమా అని కొందరు నెగిటివ్‌గా కూడా కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి వాళ్లకు మెగా అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. “మెగాస్టార్ ట్రెండ్ ఫాలో అవ్వరు… ట్రెండ్ సెట్ చేస్తారు. యంగ్ హీరోలు కూడా డూప్స్ పెట్టుకొని రిస్కీ షాట్స్ చేస్తున్నారు. కానీ చిరంజీవి మాత్రం నీతి, నిజాయితీగా తన కష్టంతో రిస్కీ షాట్స్ చేస్తున్నారు. మెగాస్టార్ అంటే అదే” అంటూ ఓ రేంజ్‌లో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
also read:OTTలోకి వచ్చేసిన యూత్ మచ్ అవైటెడ్ మూవీ.. ఇద్దరు అమ్మాయిల లవ్, రొమాన్స్..మైండ్ దొబ్బే కథరా సామీ..!
టైటిల్ టీజర్‌పై భారీ అంచనాలు:
త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. వాల్తేరు వీరయ్య విజయం తర్వాత చిరంజీవి-బాబీ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల పొల్లాచి, ఊటీలలో ఒక షెడ్యూల్‌ను కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమా మెగాస్టార్ కెరీర్‌లోనే ఒక స్పెషల్ మైల్స్‌టోన్ క్రియేట్ చేసే విధంగా ఉండబోతుందని ఫ్యాన్స్ హై రేంజ్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చూడాలి మరి… బాబీ చిరంజీవిని ఏ విధంగా మార్చి మెగా అభిమానుల ఆకలి తీర్చబోతున్నాడో…????


